Sabarimala: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్.. అయ్యప్ప దర్శనానికి ఇకపై కొత్త రూల్

శబరిమల అయ్యప్ప స్వామి దర్శన మార్గంలో ట్రావెన్‌కోర్ దేవస్థానం కొన్ని మార్పులు చేసింది. ఎక్కువ సమయం అయ్యప్పను దర్శించుకోవడం కోసం కొత్త మార్గాన్ని అమలు చేయనుంది. మార్చి 15వ తేదీ నుంచి ప్రారంభించే ఈ రూట్ ద్వారా ఎక్కువ నిమిషాలు స్వామిని దర్శించుకోవచ్చు.

New Update
sabarimala Temple

sabarimala Temple

శబరిమల వెళ్లే భక్తులకు ఇది శుభవార్త. దేవస్థానం బోర్డు చేయబోతున్న ఓ మార్పు వల్ల భక్తులు ఎక్కువ సెకన్ల పాటు అయ్యప్ప స్వామిని దర్శించుకోవచ్చు. అయ్యప్ప స్వామిని దర్శించుకునే మార్గాన్ని మార్చాలని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు నిర్ణయం తీసుకుంది. దేవుని సన్నిధిలోని పవిత్రమైన 18 మెట్లు ఎక్కిన భక్తులు డైరెక్ట్‌గా దేవుని దర్శనానికి వెళ్తారని ట్రావెన్‌కోర్ దేవస్థానం తెలిపింది. అయితే ఈ కొత్త రూట్ దర్శనం మార్చు​15వ తేదీ నుంచి అమలు అవుతుంది.

ఇది కూడా చూడండి: Horoscope Today: నేడు ఈ రాశివారికి అసలు బాలేదు..కాస్త జాగ్రత్తగా ఉండండి!

12 రోజుల పాటు కొత్త మార్గంలో..

విషుపూజ సందర్భంగా 12 రోజుల పాటు కొత్త మార్గంలోనే అయ్యప్ప దర్శనం కొనసాగుతుందని టీడీబీ అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ ప్రకటించారు. ఇది కనుక విజయవంతమైతే శాశ్వతంగా అమలు చేస్తామని తెలిపారు. పవిత్రమైన మెట్లు ఎక్కిన తర్వాత దర్శనం మంచిగా దర్శనం కావాలని భక్తుల నుంచి బోర్డుకు అభ్యర్థనలు వచ్చాయి. ఈ క్రమంలోనే అయ్యప్ప స్వామి దర్శన మార్గాన్ని మారుస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 

ఇది కూడా చూడండి: Elan Musk: ఎక్స్‌ సేవల్లో అంతరాయం..ఇది భారీ సైబర్‌ దాడే అంటున్న మస్క్‌!

ప్రస్తుతం 18 మెట్లు ఎక్కిన తర్వాత దర్శనం కోసం వంతెన దగ్గరకు పంపించి క్యూలైన్‌లో కూర్చోబెడతారు.  ఆ తర్వాత దర్శనం కోసం అవతలి వైపుకు పంపుతారు. ఈ పద్ధతి వల్ల ఐదు సెకన్లు మాత్రమే దర్శనం భాగ్యం కలుగుతుంది. దీనివల్ల 80 శాతం మంది అయ్యప్ప భక్తులు సంతృప్తి చెందడం లేదని అభ్యర్థనలు రావడంతో మార్పులు చేశారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు