Ramadan: సౌదీలో నేడే దర్శనమివ్వనున్న నెలవంక.. ఏ దేశంలో ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే?

నెలవంక కనిపించిన తర్వాత రోజు నుంచి రంజాన్ ఉపవాసం ఆచరిస్తారు. సౌదీ అరేబియాలో నేడు నెలవంక కనిపించనుంది. పాకిస్థాన్, భారత్‌లో మార్చి 1వ తేదీన నెలవంక కనిపస్తుంది. దీంతో మార్చి 2వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు రంజాన్ ఉపవాసాన్ని ఆచరిస్తారు.

New Update
Ramadan 2024 : ఈసారి రంజాన్ పండుగ ఎప్పుడొచ్చింది..చంద్రోదయ సమయం,ప్రాముఖ్యత.!

Ramadan

ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం తొమ్మిదవ నెలలో రంజాన్ మాసం ప్రారంభమవుతుంది. ముస్లిం సోదరులు అందరూ కూడా రంజాన్ మాసాన్ని తప్పకుండా పాటిస్తారు. ఈ మాసంలో ముఖ్యంగా ఉపవాసం ఆచరిస్తారు. ఖురాన్ ప్రకారం నెలవంక తర్వాత రోజు నుంచి రంజాన్ ఉపవాసం ప్రారంభిస్తారు. అయితే నేడు సౌదీలో నెలవంక కనిపించనుంది.

ఇది కూడా చూడండి:TTD Jobs: టీటీడీలో ఉద్యోగాలు.. నిరుద్యోగ యువతకు చైర్మెన్ అదిరిపోయే శుభవార్త!

నెలవంక కనిపించిన తర్వాత..

అంటే రేపు మార్చి 1వ తేదీ నుంచే రంజాన్ మాసం సౌదీలో ప్రారంభం కానుంది. ఒకవేళ నెలవంక ఈ రోజు కాకుండా రేపు కనిపిస్తే మార్చి 2వ తేదీ నుంచి రంజాన్ ఉపవాస దీక్ష చేపడతారు. సౌదీలో నేడు నెలవంక దర్శనమివ్వగా.. పాకిస్థాన్, భారత్‌లో రేపు నెలవంక దర్శనమివ్వనుంది. దీంతో ఈ రెండు దేశాల్లో రంజాన్ మాసం మార్చి 2వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్‌లో కూడా రేపే నెలవంక కనిపించనుంది.

ఇది కూడా చూడండి:Uttarakhand: ఉత్తరాఖండ్‌లో దారుణం.. హిమపాతంలో చిక్కుకున్న 57 మంది కార్మికులు

రంజాన్ మాసంలో ముస్లింలు రోజంతా ఉపవాసం ఆచరిస్తారు. సూర్యోదయానికి ముందు సుహూర్, సూర్యాస్తమయానికి ఇఫ్తార్ తింటారు. రోజంతా కనీసం నోటిలోనికి లాలాజలం కూడా వెళ్లనివ్వరు. ముస్లింలు ఉపవాసం ఆచరించడంతో పాటు ప్రార్థనలు కూడా చేస్తారు. ఈ ఏడాది రంజాన్ మాసం మార్చి 2వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరుపుకుంటారు. ఈ రంజాన్ ఉపవాసాన్ని ముస్లింలు ఎంతో కఠినంగా నిర్వహిస్తారు. సూర్యోదయానికి ముందు సుహూర్‌తో ప్రారంభించి, రాత్రి ఇఫ్తార్‌తో ఉపవాస దీక్షను విరమిస్తారు. 

ఇది కూడా చూడండి:హైదరాబాద్‌కు AICC ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్.. ముందున్న సవాళ్లు ఇవే..!

అనారోగ్య సమస్యల వల్ల ఉపవాసం మధ్యలో విరమిస్తే.. వాటిని కౌంట్ చేసి మరో రెండు రోజులు ఎక్స్‌ట్రా చేయాలి. అంటే మీకు జ్వరం వచ్చి రెండు రోజులు ఉపవాసం ఆచరించకపోతే.. తర్వాత నెల రోజుల్లోగా ఎప్పుడైనా కూడా చేయవచ్చు. 

ఇది కూడా చూడండి: Kiara Advani : గుడ్‌ న్యూస్‌ చెప్పిన కియారా అద్వానీ .. తల్లి కాబోతున్నట్లు ప్రకటన

Advertisment
తాజా కథనాలు