Raksha Bandhan 2025: ఈ రెండు సమయాల్లో రాఖీ కడితే.. అన్నీ అశుభాలే!

శుభ గడియాలో రాఖీ కట్టడం కూడా చాలా ముఖ్యమైనది. శుభ ముహూర్తంలో రాఖీ కట్టడం ద్వారా సానుకూల ప్రభావం ఉంటుంది. రాఖీ కట్టడానికి శుభ సమయం ఏంటి? ఏ దిశగా కూర్చోవాలి? రాఖీ కట్టేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏంటి? అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.. 

New Update
Raksha Bandhan 2025

Raksha Bandhan 2025

Raksha Bandhan 2025: తోబుట్టువుల ప్రేమ, విడదీయని అనుబంధానికి ప్రతీకగా 'రక్షాబంధన్' పండగను జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతీ ఏడాది శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున రాఖీ పండగను చేసుకోవడం తరాలు నుంచి వస్తున్న సంప్రదాయం. ఈ ప్రతేకమైన రోజున అక్కాచెల్లెళ్లు తమ అన్నదమ్ముల క్షేమాన్ని, సుఖసంతోషాలను కోరుకుంటూ వారికి రాఖీ కడతారు. దీనికి ప్రతిగా సోదరుడు తమ సోదరికి జీవితాంతం రక్షగా ఉంటానని ప్రమాణం చేస్తాడు. అయితే మణికట్టుకు రాఖీ కట్టేటప్పుడు కొన్ని వాస్తు నియమాలను పాటించాలి. అలాగే శుభ గడియాలో రాఖీ కట్టడం కూడా చాలా ముఖ్యమైనది. శుభ ముహూర్తంలో రాఖీ కట్టడం ద్వారా సానుకూల ప్రభావం ఉంటుంది. రాఖీ కట్టడానికి శుభ సమయం ఏంటి? ఏ దిశగా కూర్చోవాలి? రాఖీ కట్టేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏంటి? అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.. 

రాఖీ కట్టడానికి శుభ ముహూర్తం

ఈ ఏడాది రాఖీ పౌర్ణమి తిథి  ఆగస్టు 8న ప్రారంభమై ఆగస్టు 9 మధ్యాహ్నం వరకు ఉంటుంది. కావున ఆగస్టు 9న అంటేరాఖీ పండగ రోజు సూర్యోదయ సమయంలో రాఖీ కడితే శుభసూచకం!. శుభమూహూర్తం ఉదయం  5:39 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1:24 గంటల వరకు ఉంటుంది. ఈ శుభ ముహూర్తంలో సోదరులకు రాఖీ  కట్టడం ద్వారా ఆనందం,  శ్రేయస్సు చేకూరుతుంది. అయితే ఈ 7 గంటల వ్యవధిలో కొన్ని గడియాల్లో రాహు ప్రభావం ఉందని చెబుతున్నారు జోతిష్యులు. 

  • దుర్ముహూర్తం ఉదయం 08.52 నుంచి 09.44 వరకు
  • రాహు కాలం ఉదయం 11.07 నుంచి మధ్యాహ్నం 12.44 వరకు ఉంటుంది. ఈ సమయాల్లో కాకుండా మిగిలిన ఘడియల్లో సోదరులకు రాఖీ కట్టవచ్చు. 

అలాగే  హిందూ విశ్వాసాల ప్రకారం..  భద్రకాల సమయంలో కూడా  రాఖీ అస్సలు కట్టకూడదు. ఇది ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది. భద్రకాల సమయంలో ఆగస్టు 2:12 PM ప్రారంభమై.. ఆగస్టు 9 1:52 AM ముగుస్తుంది. 

ఏ దిశగా కూర్చోవాలి.. 

సోదరుడికి రాఖీ కట్టేటప్పుడు సోదరుడు  ఈశాన్య దిశగా కూర్చోవాలి. అతడి ముందు సోదరి ఉండాలి. అలాగే హారతి ప్లేట్ ని కుంకుమ, గంధం, అక్షతలు, స్వీట్లు, పువ్వులతో అలంకరించాలి. ఈ రంగురంగుల పదార్థాలు శుభాన్ని సూచిస్తాయి. ఇక దీపాన్ని వెలిగించేటప్పుడు.. దీపం తూర్పు లేదా ఉత్తర ముఖంగా ఉండేలా చూసుకోండి. వీటితో పాటు వాస్తు ప్రకారం.. రాఖీ ముడివేసేటప్పుడు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. రాఖీని కుడి చేతికి మాత్రమే కట్టాలి. కుడు చేయిని  శక్తి, కర్మలకు చిహ్నంగా చెబుతారు.  అలాగే రాఖీని కట్టేటప్పుడు మూడు ముడులు వేయడం శుభప్రదంగా భావిస్తారు. ఈ చర్యలను పాటించడం ద్వారా.. ప్రతికూల శక్తి తొలగిపోయి ఆనందం, శ్రేయస్సు, శాంతి చేకూరుతుందని నమ్ముతారు. రాఖీ కట్టిన తర్వాత అన్నదమ్ములు తమ అక్కచెల్లలకు ప్రేమతో బహుమతులను అందిస్తారు. 

Also Read: Folk Song: 'బొంబైకి రాను' తర్వాత మరో పాటతో దుమ్మురేపుతున్న రాము రాథోడ్ .. ప్రోమో చూశారా

Advertisment
తాజా కథనాలు