Vitamin B12: శరీరానికి అనేక రకాల పోషకాలు అవసరం. వాటిలో ఒకటి విటమిన్ B12. ఈ విటమిన్ లోపం వల్ల ఎముకలు బలహీనపడతాయి. విటమిన్ బి 12 లోపం శరీరంలో అనేక ఇతర సమస్యలను కూడా కలిగిస్తుంది. కాబట్టి ఆహార ప్రణాళికలో విటమిన్ బి12ను చేర్చుకోవాలి. ఒక వ్యక్తి శరీరంలో విటమిన్ బి12 లోపిస్తే అలసట, బలహీనగా ఉంటారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విటమిన్ B12 వల్ల ఎలాంటి లోపాలు ఉంటాయో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం. ఇది కూడా చదవండి: చలికాలం కదా అని గోరు వెచ్చని నీళ్ళు తాగుతున్నారా..ఈ విషయాలు తెలుసుకోండి పెసరపప్పు నీటిలో.. రోజంతా సోమరితనం ఉంటుంది. అంతేకాకుండా చేతులు, కాళ్ళలో జలదరింపు కూడా ఉంటుంది. విటమిన్ బి12 లోపానికి పెసరపప్పు నీరు చాలా మంచిది. ఒక వ్యక్తి రోజుకు ఒక్కసారైనా ఈ నీటిని తీసుకుంటే శరీరంలో విటమిన్ బి12 స్థాయి పెరుగుతుంది. పెసరపప్పు నీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. దీనిని తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు అంటున్నారు. ఇది కూడా చదవండి: రంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురుకి తీవ్ర గాయాలు దీని కోసం పెసరపప్పును ఒక కప్పు నీటిలో రాత్రంతా నానబెట్టండి. ఈ నీటిని ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి. ఇలా చేయడం వల్ల విటమిన్ B12 బాగా పెరుగుతుంది. విటమిన్ B12లోపంతో రక్తహీనత అభివృద్ధి చెందుతుంది, దీనివల్ల పాలిపోవడం, బలహీనత, అలసట, శ్వాస ఆడకపోవడం, మైకము వస్తాయని, అందుకే ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.ఇది కూడా చదవండి: వయస్సును బట్టి రోజుకు ఎన్ని బాదం పప్పులు తినాలి? గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.ఇది కూడా చదవండి: చలికాలంలో పంటి నొప్పి ఎందుకు పెరుగుతుంది?