ఈ చిట్కాలు పాటిస్తే.. పట్టు చీరలు మెరిసిపోవడం పక్కా!

పట్టు చీరలను డిటర్జెంట్ పౌడర్‌తో వాష్ చేయకూడదు. షాంపూ లేదా లిక్విడ్స్‌తోనే వాష్ చేయాలి. అలాగే వీటిని రెండు లేదా మూడు సార్లు కట్టిన వాష్ చేయడం లేదా డ్రై క్లీనింగ్‌కి ఇవ్వాలి. అప్పుడే పట్టు చీరలు ఎల్లప్పుడూ కొత్త వాటిలా మెరుస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు.

New Update
Pattu sarees

Pattu sarees Photograph: (Pattu sarees)

పెళ్లి లేదా ఏదైనా ఫంక్షన్ ఉందంటే మాత్రం తప్పకుండా పట్టుచీరలు కట్టుకుంటారు. కొందరు పట్టు చీరలను రెండు లేదా మూడు సార్లు కట్టిన తర్వాత వాష్ చేస్తారు. మరికొందరు ఒక్కసారి కట్టినా కూడా వాష్ చేస్తుంటారు. దీంతో అవి తొందరగా పాత చీరలుగా మారిపోతాయి. అయితే పట్టు చీరలు ఎల్లప్పుడూ కూడా కొత్త వాటిలా మెరిసిపోవాలంటే పాటించాల్సిన చిట్కాలు ఏంటో చూద్దాం. 

ఇది కూడా చూడండి:  Kamal Hasan: ఆలస్యంగా రావడం వల్లే ఓటమి..20 ఏళ్ల ముందే వచ్చి ఉంటే కథ వేరేలా ఉండేది!

డ్రై క్లీనింగ్

పట్టు చీరలను డిటర్జెంట్ పౌడర్‌తో అసలు వాష్ చేయకూడదు. వీటిని డ్రై క్లీనింగ్‌కు ఇవ్వాలి. అయితే పట్టు చీరను ఒక్కసారి కట్టుకున్న తర్వాత కాకుండా రెండు లేదా మూడు సార్లు కట్టుకున్న తర్వాత మాత్రమే డ్రై క్లీనింగ్‌కు ఇవ్వాలి. అప్పుడే పట్టు చీరలు నాణ్యత పోకుండా ఎలప్పుడూ కూడా కొత్త వాటిలా మెరుస్తుంటాయి. 

ఇది కూడా చూడండి:Horoscope: ఈరోజు ఈ రాశివారు డబ్బు నష్టపోయే అవకాశాలున్నాయి..జాగ్రత్త!

లిక్విడ్‌ లేదా షాంపూ
పట్టు చీరలను కేవలం లిక్విడ్ లేదా షాంపూలతో మాత్రమే వాష్ చేయాలి. అలాగే వీటికి అసలు బ్రెష్ పెట్టకూడదు. చేతులతో వాటిని శుభ్రం చేయాలి. లేదంటే షాంపూ వాటర్‌లో ఒక ఐదు నిమిషాలు పాటు వదిలేసి వాష్ చేయాలి. 

ఇది కూడా చూడండి: MK Stalin:దేని మీద రాళ్లు రువ్వుతున్నారో గమనించుకోండంటూ స్టాలిన్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌!

తక్కువ వేడి మీద ఇస్త్రీ 
పట్టు చీరలను ఎక్కువ వేడి మీద కాకుండా తక్కువ వేడి మీద మాత్రమే ఐరన్ చేయాలి. వీటిపై డైరెక్ట్‌గా ఐరన్ బాక్స్ పెట్టకూడదు. పేపర్ వేసి ఐరన్ చేస్తేనే ఎక్కువ కాలం చీరలు మన్నిక వస్తాయి. 

ఎండలో వేయకూడదు
పట్టు చీరలను ఎండలో వేయకూడదు. వీటిని ఎండలో ఆరవేస్తే.. వాటి మీద రంగు పోతాయి. అయితే తక్కువ ఖరీదు ఉన్న పట్టు చీరలు అయితే తొందరగా పాడవుతాయి. కానీ ఎక్కువ ఖరీదు ఉన్న చీరలు అయితే అంత తొందరగా పాడవ్వవు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు