/rtv/media/media_files/2025/02/24/XNHDTmvXywu5zjYWbW6m.jpg)
Pimples face Photograph: (Pimples face)
వేసవిలో తొందరగా చర్మం ట్యాన్‌కు గురి అవుతుంది. చర్మం ట్యాన్‌కు గురి కాకుండా ఉండాలని చాలా మంది బ్యూటీ ప్రొడక్ట్స్ ఎక్కువగా వాడుతుంటారు. ఇవి ఆ నిమిషానికి అందాన్ని ఇచ్చినా కూడా తర్వాత ముఖంపై మొటిమలు వచ్చేలా చేస్తాయి. ఒక్కసారి ముఖంపై మొటిమలు వస్తే మాత్రం మళ్లీ తగ్గడం చాలా కష్టం. అయితే ముఖంపై ఉండే మొటిమలు తగ్గాలంటే మాత్రం ఇలాంటి రసాయనాలు ఉండే ప్రొడక్ట్స్ కంటే సహజ చిట్కాలు పాటించడం ముఖ్యం. పోషకాలు ఎక్కువగా ఉండే బొప్పాయి ఆకులతో ఈజీగా ముఖంపై మొటిమలను తగ్గించవచ్చు.
ఇది కూడా చూడండి: TG News: గద్దర్ సినీ అవార్డులపై భట్టి కీలక ప్రకటన.. ఆ పండగరోజే ప్రారంభం!
చర్మాన్ని తెల్లగా..
బొప్పాయి ఆకుల్లో విటమిన్ ఎ, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మ సమస్యలు రాకుండా చేస్తాయి. ఎంతటి నల్లటి చర్మాన్ని అయినా కూడా బొప్పాయి ఆకులు తెల్లగా మార్చేస్తాయి. ముఖంపై మచ్చలు, మొటిమలు అన్నింటిని కూడా బొప్పాయి ఆకులు క్లియర్ చేస్తాయి. అయితే ఈ బొప్పాయి ఆకులను ఎలా ఉపయోగిస్తే ముఖంపై మచ్చలు అన్ని తొలగిపోతాయో ఈ స్టోరీలో చూద్దాం.
తాజా బొప్పాయి ఆకులను తీసుకుని రసం చేసుకోవాలి. ఈ రసాన్ని ముఖానికి అప్లై చేసి పది నిమిషాల పాటు ఉంచి తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒకటి లేదా రెండు సార్లు చేస్తే ఫలితం ఉంటుంది. అలాగే బొప్పాయి ఆకుల పేస్ట్‌ను కూడా ముఖానికి రాయవచ్చు. ఆకుల పేస్ట్‌ను ముఖానికి రాస్తే పిగ్మెంటేషన్ తగ్గుతుంది. ఈ ఆకుల పేస్ట్‌లో కలబంద పేస్ట్ కూడా అప్లై చేస్తే ముఖం ఇంకా కాంతివంతంగా తయారు అవుతుంది.
ఇది కూడా చూడండి: USAID: ట్రంప్ దెబ్బకు అబ్బా అంటున్న ట్రాన్స్‌జెండర్లు.. భారత్‌లోనూ మూతపడ్డ ఆ క్లినిక్‌లు!
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చూడండి: హిందువుగానే పుట్టా.. అలాగే చనిపోతా : డీకే శివకుమార్ సంచలన కామెంట్స్ !