నెల రోజుల పాటు తీపి తినకపోతే.. ఎన్ని కేజీలు తగ్గుతారంటే?

ఒక నెల రోజుల పాటు తీపి వస్తువులకు దూరంగా ఉంటే 3 నుంచి 5 కేజీల వరకు బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. అలాగే మధుమేహం, గుండె సమస్యలు, చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి. తీపి వల్ల చర్మంపై ముడతలు రాకుండా యంగ్ లుక్‌లో ఉంటారని నిపుణులు అంటున్నారు.

New Update
Sugar

Sugar

చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరికీ కూడా తీపి అంటే ఇష్టం. ఏదో ఒక విధంగా తీపి వస్తువులు తింటూనే ఉంటారు. నిజానికి తీపి ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అయినా కూడా చాలా మంది దీన్ని ఎక్కువగా తీసుకుంటారు. పూర్తిగా చక్కెర మానకుండా ఎవరూ ఉండలేరు. చాక్లెట్లు, ఐస్ క్రీమ్ ఇలా ఏదో విధంగా తింటూనే ఉంటారు. అయితే ఒక నెల రోజుల పాటు తీపి తినకుండా ఉంటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే ఈజీగా బరువు కూడా తగ్గుతారు. అయితే నెల రోజుల పాటు షుగర్ తినకపోతే ఎంత బరువు తగ్గుతారో ఈ ఆర్టికల్‌లో చూద్దాం. 

ఇది కూడా చూడండి: Sridhar Babu: MLC ఎన్నికలకు దూరం.. మంత్రి శ్రీధర్ బాబు సంచలన ప్రకటన!

మానసికంగా ఆరోగ్యంగా..

ఒక నెల రోజుల పాటు తీపి వస్తువులు తినకపోవడం వల్ల ఊబకాయం సమస్య నుంచి బయట పడతారు. ఒక నెలలో ఈజీగా 3 నుంచి 5 కిలోల వరకు బరువు తగ్గుతారు. తీపి వస్తువులు తినకపోవడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. అలాగే బాడీలో ఉన్న కొవ్వు అంతా కూడా కరిగిపోతుంది. వీటితో పాటు తలనొప్పి తగ్గడం, మానసిక ఆరోగ్యం కూడా కుదట పడుతుంది. అలాగే చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. తీపి వల్ల ముఖంపై ముడతలు వస్తాయి. అదే తినకపోతే యంగ్ లుక్‌లో కనిపిస్తారు. తీపి వస్తువులకు దూరంగా ఉంటే మధుమేహ రాదు. గుండె ఆరోగ్యంగా ఉండటంతో పాటు రక్తపోటు కూడా అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 

ఇది కూడా చూడండి: Pope: పోప్‌ ఆరోగ్య పరిస్థితి విషమం.. ఏమీ చెప్పలేమంటూ అధికారుల ప్రకటన!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. పూర్తి వివరాలు కోసం దీనికి సంబంధించిన నిపుణులను సంప్రదించగలరు.

ఇది కూడా చూడండి: పదిరోజులకే పెళ్లి పెటాకులు.. హనీమూన్లో గొడవ.. చివరికి బిగ్ ట్విస్ట్!

 

ఇది కూడా చూడండి: Almond Vs Coconut Oil: బాదం నూనె వర్సెస్‌ కొబ్బరి నూనె.. ఏది మంచిది?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు