/rtv/media/media_files/2025/07/02/mixer-jar-2025-07-02-18-50-32.jpg)
జ్యూస్‌లు, పచ్చళ్లు వంటి వాటికి చాలా మంది మిక్సీని వాడుతుంటారు. కానీ ఆ తర్వాత దాన్ని సరిగ్గా శుభ్రం చేసి పెట్టరు. దీనివల్ల దుర్వాసన వస్తుంది. ఆ తర్వాత ఏదైనా అందులో మిక్సీ చేసినా కూడా ఆ పదార్థం బాగోదు. అయితే మిక్సీ ఎలాంటి దుర్వాసన రాకుండా ఉండాలంటే తప్పకుండా కొన్ని చిట్కాలు పాటించాలి.
కొన్ని సెకన్ల పాటు..
మిక్సీ గిన్నెలో కాస్త పొడి బియ్యాన్ని వేసి కొన్ని సెకన్ల పాటు నడపాలి. దీనివల్ల మిక్సీ లోపల ఉన్న మురికి అంతా కూడా తొలగిపోతుంది. కొందరు మిక్సర్ వాడిన తర్వాత కనీసం క్లాత్‌తో శుభ్రం చేయకుండా వదిలేస్తారు. తడిగా ఉండటం వల్ల మిక్సీ దగ్గర దుర్వాసన వస్తుంది. ఇలా రాకుండా ఉండాలంటే మిక్సీ వాడిన వెంటనే క్లాత్‌తో తుడవాలి.
ఇది కూడా చూడండి:Kannappa Box Office Collections: మంచు విష్ణుకు బిగ్ షాక్.. 'కన్నప్ప' కలెక్షన్ల డౌన్..ప్రభాస్ కూడా ఆదుకోలేడా!
ఈ చిట్కాలు పాటించడంతో పాటు టూత్‌పేస్ట్, టూత్ బ్రష్, కోల్డ్ డ్రింక్‌తో కూడా ఈజీగా శుభ్రం చేయవచ్చు. మిక్సర్ జార్ మీద నూనె, ధూళి మరకలు కనిపిస్తే అక్కడ కోల్డ్ డ్రింక్ వేయండి. కోల్డ్ డ్రింక్ వేయగానే మొత్తం మురికి, నూనె పైకి వస్తుంది. అలాగే టూత్ పేస్ట్ అయిపోయిన దాన్ని మిక్సీపై ఉన్న మరకలతో రుద్దండి. ఆ తర్వాత దాన్ని శుభ్రం చేయాలి. ఇలా చేస్తే మిక్సీ జార్ శుభ్రంగా మారుతుంది. అలాగే ఎలాంటి దుర్వాసన కూడా ఉండదని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి:మహారాష్ట్రలో దారుణం.. నడి రోడ్డులో 17ఏళ్ల బాలికపై లైంగికదాడి!
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
ఇది కూడా చూడండి:Missing girl : సికింద్రాబాద్ లో బాలిక అదృశ్యం..అల్ఫాహోటల్ వైపు వెళ్లి.....
( Mixer Jar | tips | cleaning )