/rtv/media/media_files/2025/04/19/R3nfRFxdtv23ct1JdVlT.jpg)
లింగవివక్షను రూపుమాపే దిశగా ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అమ్మాయి పుడితే మొఖం చాటేసే వారికి ఈ పోస్ట్ మంచి గుణపాఠాన్ని నేర్పుతుంది. బెంగుళూరుకు చెందిన అజిత్ శివరామ్‌కు ఇద్దరు కుమార్తెలు. ప్రస్తుతం ఆయన లింక్డ్‌ఇన్‌లో పెట్టిన పోస్ట్ తెగ ఫేమస్ అయ్యింది. ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ల్లో వైరల్ అవుతుంది. ఇండియాలో ఆడపిల్లల్ని పెంచడంలో ఉన్న సవాళ్లు, లింగపక్షపాతం, తల్లిదంద్రుల నుంచి ఆయన చేర్చుకున్న అంశాలు పేర్కొన్నాడు. అందులో ఆయన అనుభవాలు కూడా రాసుకొచ్చారు.
Also read: Azharuddin- HCA: అజారుద్దీన్‌కు బిగ్ షాక్.. ఉప్పల్ స్టేడియంలో ఆయన పేరు మాయం
భారతదేశంలో కూతుళ్లను పెంచడం తల్లిదండ్రుల దృష్టిలో ఓ విప్లవమని పెట్టి చేసిన పోస్ట్‌లో ఆయన రోజువారీ లైఫ్ స్టైల్ గురించి వివరించాడు. చాలామంది బంధువులు ఆయనకు కొడుకు లేడని ఎత్తపొడిచే వారట. పితృస్వామ్య సమాజంలో బాలికలను పెంచడం గురించి ఆయన తెలిపారు. ఆ పోస్ట్‌లో ఆయన రాసిన విషయాలు అందరిని బాగా ఆకర్శిస్తున్నాయి. ఆఫీస్‌ల్లో ప్రస్తుతం పురుషాధిక్యత గురించి చెప్పారు. అలాగే ఆయన ఇద్దరు ఆడ పిల్లల్ని ఎలాపెంచుతున్నారని తెలిపారు.
Also read: Hydra: TDP ఎమ్మెల్యేకు హైడ్రా షాక్.. 20 ఎకరాల్లో నిర్మాణాల కూల్చివేత