Maha Shivratri 2025: శివలింగంపై ఈ వస్తువులు వేశారో.. ఇక దరిద్రం మీతోనే

శివలింగం అభిషేకానికి కుంకుమ, పసుపు, తులసి, ఎర్రటి పువ్వులు ఉపయోగించకూడదని పండితులు చెబుతున్నారు. వీటిని శివలింగంపై వేస్తే కోరిన కోరికలు నెరవేరవు. దరిద్రమంతా కూడా మీతోనే ఉండిపోతుందని పండితులు హెచ్చరిస్తున్నారు.

author-image
By Kusuma
New Update
Maha Sivaratri 2025..

Maha Sivaratri 2025..

Maha Shivratri 2025: మహా శివరాత్రి పండుగను నేడు (ఫిబ్రవరి 26వ తేదీన) దేశ వ్యాప్తంగా జరుపుకుంటారు. భక్తితో శివుడిని మహా శివరాత్రి నాడు పూజిస్తే కోరిన కోరికలు అన్ని కూడా నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. శివునికి అభిషేకం అంటే ఇష్టం. నీరు, పాలు ఇలా కొన్నింటితో అభిషేకాలు చేస్తారు. అయితే శివుడికి కొన్ని వస్తువులతో అసలు అభిషేకం చేయకూడదని పండితులు చెబుతున్నారు. మరి ఆ వస్తువులేంటో ఈ స్టోరీలో చూద్దాం. 

ఇది కూడా చూడండి: This Week Movies: మహాశివరాత్రి స్పెషల్.. థియేటర్, ఓటీటీలో సినిమాల జాతర! లిస్ట్ ఇదే

కుంకుమ, పసుపు

చాలా మంది శివలింగంపై కుంకుమ, పసుపు వేస్తుంటారు. శివునికి వీటితో అసలు అభిషేకం చేయకూడదని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే కుంకుమ, పసుపు స్త్రీలకు సంబంధించినది. కాబట్టి శివు లింగానికి వీటితో అభిషేకం చేయకూడదు. 

ఇది కూడా చూడండి: TG JOBS: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో 50 వేల ఉద్యోగాలకు సీఎం గ్రీన్ సిగ్నల్!

తులసి
తులసి ఆకులను కూడా శివ లింగంపై వేయకూడదు. ఎందుకంటే తులసి రాక్షస వంశంలో జన్మించింది. అయితే ఈ రాక్షస వంశం శివుడిని శపించింది. ఈ కారణంగానే శివ లింగంపై తులసి ఆకులు వేయరు.

ఇది కూడా చూడండి: Breaking News : కాంగ్రెస్ మాజీ ఎంపీకి బిగ్ షాక్.. ఢిల్లీ కోర్టు జీవిత ఖైదు!

శంఖాలు
శంఖంలో నీరు, పాలు వంటివి వేసి వాటితో శివ లింగానికి అభిషేకం చేయకూడదు. 

ఇది కూడా చూడండి: Viral Video: రోజులు మారాయ్.. మేము కూడా డాన్సర్లమే బాబూ - అర్చకుల బ్రేక్ డాన్స్‌తో కిక్కిరిసిపోయిన రోడ్లు!

ఎరుపు రంగు పువ్వులు
శివుడి ఎరుపు రంగు పువ్వులు అంటే నచ్చదు. వీటిని అసలు శివలింగానికి సమర్పించకూడదు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. పూర్తి వివరాలు కోసం దీనికి సంబంధించిన నిపుణులను సంప్రదించగలరు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు