Mahashivratri 2025: శివరాత్రికి ఈ సమస్యలు ఉన్నవారు ఉపవాసం ఉంటున్నారా.. తస్మాత్ జాగ్రత్త

అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మహా శివరాత్రి ఉపవాసం ఆచరించకూడదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మధుమేహం, జీర్ణ సమస్యలతో బాధపడేవారు అసలు ఉపవాసం ఉండకూడదు. అలాగే బాడీ నీరసంగా ఉన్నవారు కూడా ఉపవాసం ఉండకూడదని నిపుణులు చెబుతున్నారు.

author-image
By Kusuma
New Update
Maha Sivaratri 2025..

Maha Sivaratri 2025..

Mahashivratri 2025: నేడు మహా శివరాత్రి పండుగ. ఫిబ్రవరి 26వ తేదీన దేశ వ్యాప్తంగా ఈ పండుగను జరుపుకుంటారు. మహా శివరాత్రి నాడు భక్తితో శివుడిని పూజించడం వల్ల కోరిన కోరికలు అన్ని కూడా నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. శివరాత్రి రోజున శివుడిని పూజించడంతో పాటు కొందరు ఉపవాసం ఆచరిస్తారు. ఉపవాసం ఆచరిస్తే ఎలాంటి నియమాలు తెలుసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం. 

ఇది కూడా చూడండి: Sridhar Babu: MLC ఎన్నికలకు దూరం.. మంత్రి శ్రీధర్ బాబు సంచలన ప్రకటన!

జీర్ణ సమస్యలు రావడంతో పాటు..

మహా శివరాత్రి నాడు చాలా మంది ఉపవాసం ఉంటారు. అయితే అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఉపవాసం ఉండకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఉపవాసం ఉంటే ఆరోగ్యం ఇంకా క్షీణిస్తుంది. జీర్ణ సమస్యలు, డయాబెటిస్, నీరసం వంటి సమస్యలు ఉన్నవారు ఉపవాసం ఉండకపోవడం బెటర్. ఎందుకంటే ఉపవాసం ఉంటే ఈ సమస్యలు పెరుగుతాయి.

ఇది కూడా చూడండి: Almond Vs Coconut Oil: బాదం నూనె వర్సెస్‌ కొబ్బరి నూనె.. ఏది మంచిది?

రోజంతా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల బాడీ కూడా డీహైడ్రేషన్‌కు గురవుతుంది. దీంతో కళ్లు తిరిగి పడిపోయే ప్రమాదం ఉంది. మీరు ఉపవాసం చేయడానికి రెడీగా ఉన్నారంటేనే చేయండి. కాస్త బాడీకి నీరసం అనిపించినా కూడా అసలు ఉపవాసం ఉండవద్దు. ఉపవాసంలో ఉన్నప్పుడు చాలా మంది ఎనర్జీ కోసం కాఫీ, టీలు ఎక్కువగా తాగుతుంటారు. ఇవి ఆ నిమిషానికి కాస్త ఎనర్జీని ఇచ్చినా కూడా అనారోగ్య సమస్య బారిన పడేలా చేస్తాయి. వీటికి బదులు తులసి టీ, గ్రీ టీ వంటివి తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. 

ఇది కూడా చూడండి: Pope: పోప్‌ ఆరోగ్య పరిస్థితి విషమం.. ఏమీ చెప్పలేమంటూ అధికారుల ప్రకటన!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.  

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు