/rtv/media/media_files/2025/09/07/chandragrahanam-2025-09-07-07-15-39.jpg)
నేడు రాత్రి 9.58కి చంద్ర గ్రహణం మొదలుకానుంది. కానీ సూతక కాల ప్రభావం మధ్యాహ్నం 12.57 నుంచే ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో ఆహారం తీసుకోవద్దు. వండుకోవద్దు. ముందే వండిపెట్టిన ఆహారంపై దర్భ గడ్డి/తులసి ఆకులు వేసి ఉంచాలి. లేదంటే కలుషితం అవుతుంది. గ్రహణ సమయంలో శుభకార్యాలు, పూజలు వద్దు. సెప్టెంబర్ 8, 1.26AMకి గ్రహణం ముగుస్తుంది. ఆ తర్వాత దానాలు చేస్తే విశిష్టమైన ఫలితాలు లభిస్తాయని పండితులు సూచిస్తున్నారు. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో బయటకు వెళ్లడం, చంద్రుడిని చూడటం మానుకోవాలి. ఇది కడుపులోని బిడ్డకు హానికరమని నమ్ముతారు.
*నేడు సంపూర్ణ చంద్ర గ్రహణం*
— AppalaNaiduKellaiTdp (@AppalaNaiduKe12) September 7, 2025
* రాత్రి 8:55 గంటల నుంచి చంద్రగ్రహణం
* రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 12:22 గంటల దాకా సంపూర్ణ గ్రహణం
* చంద్ర గ్రహణంతో దేశవ్యాప్తంగా పలు ఆలయాలు మూసివేత.
నేడు సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుంది. రాత్రి.8.58 గంటలకు గ్రహణం ప్రారంభమై, రాత్రి 11 నుంచి అర్ధరాత్రి 12.22 గంటల వరకు సంపూర్ణ గ్రహణం ఏర్పడుతుంది. రేపు తెల్లవారుజామున 2.25 గంటలకు గ్రహణం ముగుస్తుంది. భారత్‌తో పాటు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, యూరప్ దేశాల్లోనూ చంద్రగ్రహణం కనిపిస్తుంది. గ్రహణం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలను ఇవాళ కొన్ని గంటలపాటు మూసివేయనున్నారు.
చంద్రగ్రహణం సందర్భంగా ఇవాళ తిరుమల శ్రీవారి ఆలయం మూసివేస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం 3.30గంటలకు ఆలయం మూసివేస్తాం. రేపు సుప్రభాత సేవతో ఆలయ తలుపులు తెరుస్తాం. మధ్యాహ్నంలోపు 30వేల మందికి దర్శనం కల్పిస్తాం. వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు అని చెప్పారు. అలాగే శ్రీశైలం ఆలయం కూడా ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూసివేయనున్నారు.
గ్రహణం సమయంలో
గ్రహణం సమయంలో దైవ నామస్మరణ, ధ్యానం చేయడం చాలా మంచిది. ఇది మనసును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. గ్రహణానికి ముందు, తర్వాత తప్పనిసరిగా తలస్నానం చేయాలి. గ్రహణానికి ముందు పట్టు స్నానం గ్రహణానికి తరువాత విడుపు స్నానం అంటారు. ఇది గ్రహణ దోషాలు తొలగిస్తాయని నమ్మకం. మేష, వృషభ, ధనుస్సు, కన్య రాశులవారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. మిథున, కర్కాటక, కుంభ, మీన రాశుల వారికి ఆర్థికంగా ఇబ్బందులు, ఖర్చులు పెరగడం వంటివి సంభవించవచ్చు. ప్రతి ఒక్కరి జాతకంలో గ్రహ స్థానాలను బట్టి ఫలితాలు మారవచ్చు.
చంద్రగ్రహణం వేళ చదవాల్సిన మంతత్రంఓం శ్రాం శ్రీం సః చంద్రమసే నమః అనే మంత్రాన్ని జపించాలిఈ చంద్ర మంత్రాన్ని జపించడం వల్ల చంద్రుడి అనుగ్రహం లభించడంతో పాటు మనసుశాంతంగ,ప్రశాంతంగా ఉంటుంది.మహా మృత్యుంజయ మంత్రం, త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్దనం.ఉర్వారుకమివ బంధనాన్మృతోర్ముక్షీయ మామృతత https://t.co/IIZJh1oODi
— JANAKI SARIPALLI (@janakipappu) September 6, 2025
Also Read : Mahindra Cars: జీఎస్టీ ఎఫెక్ట్..భారీగా తగ్గిన మహీంద్రా కార్లు..తక్షణమే అమలు