/rtv/media/media_files/2024/11/10/salt33.jpeg)
Salt Photograph: (Salt)
ఈ సృష్టిలో ప్రతి విషయం వెనుక ఒక మూఢనమ్మకంతో పాటు ఒక శాస్త్రీయ కారణం కూడా ఉంటుంది. పసుపు ఇంటి గడపలకు ఎందుకు రాయాలి, ఉప్పు చేతికి ఎందుకు ఇవ్వకూడదు ఇలా రకరకాల ప్రశ్నల వెనుక మూఢనమ్మకంతో పాటు శాస్త్రీయ కారణం ఉంది. ఉదాహరణకు పసుపు గడపాలకు ఎందుకు రాయాలి అంటే.. ఇంట్లోకి లక్ష్మీదేవి కోసం అనేది నమ్మకం.. బాక్టీరియా లోపలికి రాకుండా అనేది సైన్స్. అలాగే ఉప్పు చేతికి ఎందుకు ఇవ్వకూడదు అనేదాని వెనుక కూడా శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Also Read : వ్యాయామంతో మానసిక ఆరోగ్యం మెరుగు.. దాని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా..?
సైన్స్ కారణాలు
తేమ
ఉప్పుకు హైగ్రోస్కోపిక్ అనే తేమను పీల్చుకునే గుణం ఉంటుంది. దీని కారణంగానే ఉప్పును చేతికి ఇవ్వకూడదని చెబుతారు. సాధారణంగా మనం అటు ఇటు తిరగడం, పనులు చేయడం ద్వారా చేతులు తేమ, దుమ్ము, దూళి, బాక్టీరియాను కలిగి ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో చేతులు కడుక్కోకుండా ఉప్పును పట్టుకోవడం ద్వారా తేమతో పాటు ఆ దుమ్ము, బాక్టీరియాను ఉప్పు పీల్చుకుంటుంది. ఈ ఉప్పును తినడం ద్వారా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకే ఉప్పు చేతికి ఇవ్వకూడని చెబుతారు.
షాక్
అయితే సాధారణంగా కొన్ని సార్లు స్టీల్, ఐరన్ వస్తువులు పట్టుకున్నప్పుడు, సింథటిక్ తో తయారు చేసిన దుస్తువులు ధరించినప్పుడు షాక్ కొట్టడం గమనించే ఉంటారు. స్టాటిక్ ఎలక్ట్రిసిటీ కారణంగా ఇలా జరుగుతుంటుంది. అయితే ఉప్పుకు కూడా ఇలాంటి గుణం ఉంటుందట. అందుకే ఉప్పును చేతికి ఇవ్వకూడని చెబుతారు.
ఆరోగ్యం
ఉప్పు అతిగా తినడం అధిక రక్తపోటుకు దారితీస్తుంది. ఉప్పులోని అధిక సోడియం కంటెంట్ కారణంగా బ్లడ్ ప్రెజర్ పెరిగి గుండెపోటు ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉప్పు చేత్తో ఇవ్వడం అనేది.. మనమే ఎదుటివారికి అనారోగ్యాన్ని కొని తెచ్చిచ్చినట్లు అవుతుంది. ఈ ఆరోగ్య కారణాలు కూడా ఉప్పు చేతికి ఇవ్వకూడదు అనే నానుడి వెనుక కారణాలు.
Also Read : ఈ నియమాలు శ్రావణ మాసంలో పాటిస్తే.. దరిద్రం పోయి.. సకల సంతోషాలు కలుగుతాయట!
నమ్మకాలు
అయితే ఉప్పును బంగారంతో పోలుస్తారు. అలాంటి ఉప్పును ఇతరులకు ఇవ్వడం మన లక్ష్మీ దేవిని దూరం చేసుకున్నట్లుగా భావిస్తారు. అందుకే ఉప్పును అరువుగా ఇవ్వరు. అంతేకాదు ఉప్పును చేతికి ఇవ్వడం ద్వారా గొడవలు జరుగుతాయని నమ్ముతారు.
ఇదిలా ఉంటే ఉప్పును తగిన మోతాదులో తీసుకోవడం మాత్రమే ఆరోగ్యానికి మంచిది. అధిక ఉప్పు కారణంగా రక్తపోటు, గుండెపోటు సమస్యలు తలెత్తుతాయి. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల సోడియం కంటెంట్ పెరిగిపోయి రక్తనాళాల గోడల్లో పేరుకుపోతుంది. దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ కి ఆటంకం ఏర్పడి సడెన్ స్ట్రోక్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కావున రోజు తినే ఆహారంలో ఉప్పు చూసి వేసుకోవాలి. అలాగే సోడియం కంటెంట్ అధికంగా ఉన్న ఆహార పదార్థాలకు కూడా దూరంగా ఉండాలి.
గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
salt | latest-telugu-news | healthy life style