/rtv/media/media_files/2025/07/30/shravana-masam-2025-2025-07-30-12-32-42.webp)
shravana masam 2025
హిందువులు శ్రావణ మాసంలో ఎంతో పవిత్రంగా పూజలు నిర్వహిస్తారు. శివుడికి ప్రీతికరమైన ఈ మాసంలో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా నియమాలు పాటిస్తూ పూజలు నిర్వహించడం వల్ల అదృష్టం కలుగుతుందని పండితులు అంటున్నారు. కొందరు ఏదో నార్మల్‌గా శ్రావణ మాసం పాటిస్తారు. ఉల్లిపాయలు, మాంసాహారం వంటివి తింటారు. దీనివల్ల ప్రతీ పనిలో ఆటంకం ఏర్పడటంతో పాటు ఇంటికి లక్ష్మీదేవి రాకుండా దరిద్ర దేవత వస్తుందని పండితులు చెబుతున్నారు. శివుడికి ఎంతో ఇష్టమైన ఈ శ్రావణ మాసంలో పాటించాల్సిన నియమాలు ఏంటి? పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి: Naga Panchami 2025: నాగ పంచమి నాడు ఇలా చేస్తే.. లెక్కలేనంత డబ్బు మీ సొంతం
శివుడికి ప్రత్యేక పూజలు
ఈ మాసం శివుడికి ప్రత్యేకమైనది. శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తి శ్రద్ధలతో ఆరాధించడం వల్ల అదృష్టం కలుగుతుందని, అలాగే కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ మాసంలో వచ్చే ప్రతీ సోమవారం శివుడికి పూజలు నిర్వహించాలని పండితులు అంటున్నారు. ఈ మాసంలో వచ్చే ప్రతీ సోమవారం చాలా ప్రత్యేకమైనది. ఇంతటి పవిత్రమైన రోజు ఉపవాసం ఆచరించి శివాలయాన్ని సందర్శించాలి. అలాగే శివుడికి ప్రత్యేకమైన అభిషేకాలు నిర్వహించాలి. ముఖ్యంగా రుద్రాభిషేకం చేయడం వల్ల పాపాలు అన్ని తొలగిపోయి, శుభాలు జరుగుతాయని పండితులు అంటున్నారు. శివుడికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, గంగా జలం, బిల్వ పత్రాలతో ప్రదోష కాలంలో అభిషేకం చేయాలి. దీంతో పాటు మహా మృత్యుంజయ మంత్రాన్ని కూడా జపించాలి. ఈ మంత్రాన్ని జపించడం వల్ల ఆరోగ్యం, దీర్ఘాయువు, దురదృష్టం వంటి సమస్యలు తొలగిపోతుందని భక్తులు నమ్ముతారు.
ఇది కూడా చూడండి:Naga Panchami 2025: నాగ పంచమి నాడు ఈ వస్తువులను అస్సలు వాడకండి
శుక్రవారాల్లో పూజించడం వల్ల
శ్రావణ మాసంలో శివుడితో పాటు లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు. శుక్రవారాల్లో లక్ష్మీ దేవిని పూజించడం వల్ల ధనం, ఐశ్వర్యం, సుఖ సంతోషాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. వివాహిత మహిళలు తమ భర్త ఆయుష్షు కోసం, అవివాహిత మహిళలు మంచి భర్త రావాలని శుక్రవారం వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు. ఈ పూజలు నిర్వహించేటప్పుడు ఉపవాసం ఆచరించాలి. అలాగే సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. వీటితో పాటు పేదలకు దానం చేయడం వంటివి చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. వీటన్నింటి కంటే ముఖ్యంగా ఆలోచనలు పాజిటివ్‌గా ఉండాలి. మనస్సులో ఎలాంటి కోసం, అసూయ వంటివి లేకుండా కేవలం భగవంతుని నామస్మరణ మాత్రమే ఉండాలని పండితులు చెబుతున్నారు.
అసలు చేయవద్దు..
ఈ మాసంలో కొందరు తెలిసో తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. డైలీ మాంసాహారం తినడం, ఉల్లిపాయలు, మద్యం, ధూమపానం వంటివి చేస్తుంటారు. వీటిని తీసుకోవడం వల్ల పాపాలు అంటుకుంటాయని పండితులు అంటున్నారు. అలాగే ఈ మాసంలో సూర్యోదయం తర్వాత కాకుండా సూర్యాస్తమయానికి ముందు నిద్ర లేవాలని పండితులు చెబుతున్నారు. దీనివల్ల కోరిన కోరికలు నెరవేరడంతో పాటు అదృష్టం కలుగుతుందని అంటున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.