Weight Loss: ప్రతిరోజు ఉదయం ఇలా చేస్తే.. 30 రోజుల్లోనే నాజూకు నడుము!

బరువు తగ్గాలంటే పూర్తిగా ఆహారాన్ని మానేయాల్సిన అవసరం లేదు.. ఆహారంలో సరైన మార్పులు చేసుకుంటే సరిపోతుంది. అధిక బరువును నియంత్రించడానికి పాటించాల్సిన కొన్ని నియమాలు ఇక్కడ తెలుసుకోండి

New Update
Weight Loss Tips: ఈ ఫుడ్స్ ను ఉదయాన్నే తింటే.. అస్సలు బరువు తగ్గరు..!!

Weight Loss: ఈ మధ్య చాలా మందిని వేధిస్తున్న సమస్య ఊబకాయం, అధిక బరువు. బరువు తగ్గాలని రకరకాల డైట్ , వ్యాయామాలు చేస్తుంటారు. కొంతమంది ఆహారాన్ని పూర్తిగా మానేస్తుంటారు. ఇలా  చేయడం ఆరోగ్యానికి చాలా హానికరం. బరువు తగ్గాలంటే పూర్తిగా ఆహారాన్ని మానేయాల్సిన అవసరం లేదు.. ఆహారంలో సరైన మార్పులు చేసుకుంటే సరిపోతుంది. అధిక బరువును నియంత్రించడానికి పాటించాల్సిన కొన్ని నియమాలు ఇక్కడ తెలుసుకోండి. 

Also Read:Viral News: తల్లికి, బిడ్డకు ఒకేసారి కడుపు చేసిన యూట్యూబర్.. నెట్టింట ఫొటోస్ షేర్ చేయడంతో రచ్చ రచ్చ!

ప్రోటీన్ అధికం

ఉదయం బ్రేక్ ఫాస్ట్ కోసం ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం అలవాటు చేసుకోండి. గుడ్లు, తృణధాన్యాలు, బాదం, వాల్‌నట్స్ , అంజీర్ వంటి డ్రై ఫ్రూట్స్ తినడం ద్వారా శరీరంలో కేలరీ కంటెంట్ తక్కువగా ఉంటుంది. అలాగే రోజంతా ఉత్సాహంగా ఉంటారు.  

వ్యాయామం 

బరువు తగ్గడానికి, ప్రతిరోజూ తేలికపాటి వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. వ్యాయామం కండరాలను బలపరుస్తుంది. అలాగే  శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. తక్కువ సమయంలోనే చాలా కేలరీలను బర్న్ చేయడంలో తోడ్పడుతుంది.

డీటాక్స్ పానీయాలు 

ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు త్రాగాలి. జీలకర్ర, కొత్తిమీర, సోంపు,  మెంతుల నీరు బరువు తగ్గడానికి సహాయపడతాయి. కావాలంటే, వీటిలో నిమ్మరసం,  తేనెను కూడా జోడించవచ్చు.

నూనె, సుగంధ ద్రవ్యాలు, స్వీట్లకు

బరువు తగ్గాలనుకునేవారు , నూనె, సుగంధ ద్రవ్యాలు, చక్కెర అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. ఇవి బరువు పెరగడానికి కారణమవుతాయి.వీటిలో చాలా కొవ్వు ఉంటుంది. తద్వారా బరువు పెరుగుతారు. 

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

latest-news | weight-loss | 10-weight-loss-tips | life-style

Also Read:HIT 3: రిలీజ్ కి ముందే అర్జున్ సర్కార్ హవా.. భారీ ధరకు అమ్ముడైన 'హిట్3' డిజిటల్ రైట్స్.. ఎంతంటే

Advertisment
తాజా కథనాలు