Tomato juice: టమోటా రసంతో లివర్ కి సంబంధమేంటి..? దీన్ని తీసుకుంటే నిజంగానే అలా జరుగుతుందా!

ప్రతీ రోజు ఒక కప్పు టమోటా రసం తాగడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. టమోటాలో విటమిన్ A, విటమిన్ E, ఫ్లేవనాయిడ్లు, లైకోపీన్ వంటి పోషకాలు ఉంటాయి. లైకోపీన్ లివర్ డిటాక్సిఫికేషన్, క్యాన్సర్ నిర్వహణలో తోడ్పడుతుంది.

New Update
tomato juice benefits

tomato juice benefits

Tomato juice: మనం రోజూ తినే అనేక రకాల కూరగాయల్లో టమోటా ఒకటి. అయితే టమోటో కేవలం కూరగాయ మాత్రమే కాదు, దీనిలో ఆరోగ్యానికి అవసరమయ్యే అనేక పోషకాలు ఉంటాయి. టమోటోలోని లైకోపీన్ అనే కంపౌండ్ క్యాన్సర్ నివారణలో సహాయపడుతుంది. అలాగే దీనిలోని అధిక నీటి శాతం శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో తోడ్పడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతీ రోజు ఒక కప్పు టమోటా రసం తాగడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. రోజూ 240ml టమోటో రసాన్ని తాగడం ద్వారా శరీరానికి కావాల్సిన రోజువారీ 'విటమిన్ సి' అవసరాన్ని తీరుస్తుంది. అలాగే  దానిలోని ఆల్ఫా, బీటా కెరోటిన్ పోషకాల రూపంలో శరీరానికి విటమిన్ A ను అందిస్తుంది. అయితే బయట మార్కెట్లట్లో దొరికే రెడీ మేడ్ టమోట మిక్స్ లు కాకుండా ఇంట్లోనే తయారు చేసుకోవడం మంచిది.  

టమోటా రసం ప్రయోజనాలు

  • టమోటాలో  విటమిన్ A, విటమిన్ E, ఫ్లేవనాయిడ్లు, ఫైటోస్టెరాల్స్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. విటమిన్ Aకు టమోటా అద్భుతమైన మూలం. విటమిన్ ఎ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 
  • బరువు తగ్గాలనుకునేవారు రోజూ టమాటా రసం తాగడం ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిలో తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ బరువు తగ్గడంలో సహాయపడతాయి. 
  • టమోటా రసం కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీనిలోని  లైకోపీన్ అనే పదార్థం కాలేయ వాపును నివారిస్తుంది. లివర్ డిటాక్సిఫికేషన్ ప్రక్రియలో తోడ్పడుతుంది. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తుంది. 

 టమోటా రసం తయారు చేసే విధానం

  • ముందుగా, టమోటాలను తరిగి  మీడియం మంట పై మూతపెట్టిన ఉడికించాలి.
  • ఉడికిన తర్వాత టమోటాలు చల్లార్చి మిక్సి వేయండి. మీకు అవసరమైన ద్రవ పరిమాణం ప్రకారం నీటిని జోడించండి. 
  • ఆ తర్వాత టేస్ట్ కోసం నల్లమిరియాల పొడి, జీలకర్ర పొడి,  కొత్తిమీర, ఎర్ర క్యాప్సికమ్,  ఒరేగానో కలుపుకుంటే టమాటో రసం రెడీ. తియ్యగా కావాలనుకునే వాళ్ళు తేనే కలుపుకుంటే సరిపోతుంది. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. పూర్తి వివరాలు కోసం దీనికి సంబంధించిన నిపుణులను సంప్రదించగలరు.

ఇది కూడా చూడండి: Sourav Ganguly : సౌరవ్ గంగూలీకి తప్పిన ఘోర ప్రమాదం.. రెండు కార్లు ధ్వంసం!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు