/rtv/media/media_files/2025/02/16/GMbtSLmvIxaaKUDb6Rwj.jpg)
makhana health
Makhana Benefits: ఈ మధ్య హెల్తీ డైట్ లో మఖానా పేరు ఎక్కువగా వినిపిస్తోంది. చూడడానికి తెల్లగా బంతి మాదిరిగా కనిపించే ఈ మఖానాలో పుష్కలమైన పోషకాలు ఉంటాయి. దీనిని తినడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో కార్బోహైడ్రేట్లు కాల్షియం, మెగ్నీషియం, ఇనుము మరియు ఫాస్ఫరస్ అనేక రకాల సూక్ష్మపోషకాలు లభిస్తాయి. జీవన శైలి వ్యాధులు రక్తపోటు, బీపీ ఉన్నవారికి ఇదొక వరమనే చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేకాదు ఇందులో యాంటీ ఏజింగ్ లక్షణాలు కూడా ఉన్నాయి. దీనిని కూరగాయలా, చిరుతిండిగా రెండు విధాలా తినవచ్చు. డైట్ లో మఖానా తీసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
మఖానా ప్రయోజనాలు
రక్తపోటు
హై బీపీ ఉన్నవారికి మఖానా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మఖానాలోని తక్కువ సోడియం కంటెంట్, ఎక్కువ మెగ్నీషియం కంటెంట్ రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది.
పురుషులలో టెస్టోస్టెరాన్
ముఖాన గింజలు తినడం వల్ల పురుషులలో టెస్టోస్టెరాన్ స్థాయి పెరుగుతుంది. అలాగే కండరాలను కూడా బలంగా చేస్తుంది. వ్యాయామం తర్వాత దీన్ని తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
మెంటల్ హెల్త్
రాత్రి పడుకునే ముందు పాలలో మఖానా కలిపి తీసుకోవడం ద్వారా ఒత్తిడి, అలసట తగ్గుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది.
Also Read : Tamilanadu: ఒక్క నిమ్మకాయ అక్షరాలా రూ.6 లక్షలు.. అందులో ఏమంతా స్పెషల్ ఉందబ్బా!
/rtv/media/media_files/2025/02/16/c4VnT8zv2H0kCs8QYQOK.jpg)
బరువు
మఖానాలో తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి సహాయపడతాయి. అలాగే ఎక్కువ సమయం వరకు ఆకలి అనే భావనను కలిగించదు. కడుపులో కొవ్వు శోషణను తగ్గిస్తుంది.
డయాబెటీస్
మధుమేహంతో బాధపడుతున్న వారికి కూడా మఖానా సరైన ఎంపిక. మఖానా తక్కువ గ్లైసెమిక్ వ్యాల్యును కలిగి ఉంటుంది. దీనివలన రక్తంలో చక్కర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
చర్మానికి..
మఖానా చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. దీనిలో అమైనో ఆమ్లాలు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని నిగారింపుగా, మృదువుగా చేయడంలో సహాయపడతాయి. అలాగే మచ్చలు, ముడతలను తొలగించడంలో తోడ్పడతాయి. చర్మ ఆకృతిని కూడా మెరుగుపరుస్తాయి.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
Also Read: Monalisa Photo: హీరోయిన్లకే అసూయ పుట్టే అందం.. మిల మిల మెరిసిపోతున్న మోనాలిసా