/rtv/media/media_files/2025/01/05/Iyk565VJQuQXYFsxpk7x.jpg)
red wine heart stroke
Heart Stroke: నేటి బిజీ లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్ల కారణంగా వయసు సంబంధం లేకుండా గుండె పోటు మరణాలు సంభవిస్తున్నాయి. సంవత్సరం పిల్లలు కూడా గుండె పోటుకు గురవుతున్నారు. అయితే తాజాగా గుండెపోటు సమస్యలకు సంబంధించి నిర్వహించిన ఓ అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి.
Also Read: Gandhi TathaChettu: థియేటర్స్ లో సుకుమార్ కూతురు అవార్డు విన్నింగ్ షార్ట్ ఫిల్మ్..!
రెడ్ వైన్ తో గుండె పోటు ముప్పు..
బార్సిలోనా విశ్వవిద్యాలయం జరిపిన పరిశోధన ప్రకారం, అతిగా కాకుండా వారానికి ఒక గ్లాస్ నుంచి సగం గ్లాస్ రెడ్ వైన్ తీసుకోవడం గుండెపోటు లేదా స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని పేర్కొన్నారు. అలా కాకుండా ప్రతి రోజూ రెడ్ వైన్ తాగే వారు స్ట్రోక్ వంటి తీవ్రమైన గుండె సంబంధిత సమస్యలను కలిగి ఉంటారని పరిశోధనలో తేలింది. తక్కువ పరిమాణంలో తీసుకునే వారిలో 30 శాతం గుండెపోటు ముప్పు తగ్గినట్లు అధ్యయనంలో తెలిపారు. బ్రిటీష్ హార్ట్ ఫౌండేషన్ సీనియర్ డైట్ నిపుణుడు ట్రేసీ పార్కర్.. ''తక్కువ లేదా మితమైన మొత్తంలో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుందని ఇప్పటికే పరిశోధనలు చెబుతున్నప్పటికీ, రెడ్ వైన్ వల్ల మరింత ప్రయోజనం ఉందని తెలిపారు.''
Also Read: పుష్పగాడి బాక్సాఫీస్ రూల్.. నాలుగు వారాల్లో ఎన్ని కోట్లంటే .. దంగల్ రికార్డు బ్రేక్?
అయితే నిపుణులు ఈ పరిశోధనను పూర్తిగా ధృవీకరించలేదని తెలిపారు. దీని కోసం మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అలాగే అధిక మద్యపానం వల్ల గుండె, రక్త ప్రసరణ సంబంధిత సమస్యలు అధిక రక్తపోటు, కాలేయ సమస్యలు వస్తాయని హెచ్చరించారు.
Also Read: Winter: మగవారి కంటే ఆడవాళ్ళకి చలి ఎందుకు ఎక్కువ ? కారణం తెలుసుకోండి..మీకే మంచిది