Gandhi TathaChettu: థియేటర్స్ లో సుకుమార్ కూతురు అవార్డు విన్నింగ్ షార్ట్ ఫిల్మ్..!

డైరెక్టర్ సుకుమార్ కుమార్తె సుకృతి వేణి ప్రధాన పాత్రలో నటించిన అవార్డు విన్నింగ్ షార్ట్ ఫిల్మ్ 'గాంధీ తాత చెట్టు'. తాజాగా ఈ చిత్రాన్ని థియేటర్స్ లో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 24న రిలీజ్ కానుంది.

New Update
Gandhi TathaChettu

Gandhi TathaChettu

Gandhi TathaChettu: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్, తబిత దంపతుల కుమార్తె  సుకృతి ప్రధాన పాత్రలో నటించి షార్ట్ ఫిల్మ్  'గాంధీ తాత చెట్టు'. సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్, గోపీ టాకీస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ ముఖ్య ఉద్దేశంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఇప్పటికే పలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శించగా.. అనేక అవార్డులు సొంతం చేసుకుంది. 

Also Read: RGV: వివాదాలకు పోను, అమ్మాయిల జోలికి అస్సలే పోను.. RGV న్యూ ఇయర్ ట్వీట్ !

ఉత్తమ బాల నటిగా.. 

11వ నోయిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ చిత్రంగా అవార్డు అందుకుంది. అంతేకాదు న్యూఢిల్లి ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో జ్యూరి బెస్ట్ చిత్రంగా, జైపూర్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌, 8వ ఇండియ‌న్ వ‌ర‌ల్డ్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లోనూ  బెస్ట్ జ్యూరీ ఫిల్మ్ గా  'గాంధీ తాత చెట్టు'  అవార్డులు గెలుచుకుంది.  ఈ చిత్రంలో సుకృతి నటనకు ఉత్తమ బాలనటిగా   దుబాయ్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌,  దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకుంది. 

థియేటర్స్ లో విడుదల

అయితే తాజాగా ఈ చిత్రాన్ని థియేటర్స్ విడుదల చేయనున్నట్లు ప్రకరించారు మేకర్స్. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 24న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు.  తబితా సుకుమార్ సమర్పించిన ఈ చిత్రానికి  ప‌ద్మావ‌తి మ‌ల్లాది దర్శకత్వం వహించారు. 

Also Read: Prabhas Spirit Movie: పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్.. స్పిరిట్ స్టోరీ లైన్ పై సందీప్ వంగా క్లారిటీ

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు