Winter: మగవారి కంటే ఆడవాళ్ళకి చలి ఎందుకు ఎక్కువ ? కారణం తెలుసుకోండి..మీకే మంచిది పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా చలి అనుభవిస్తారు. అసలు ఆడవాళ్లకే చలి ఎందుకు ఎక్కువ అని ఎప్పుడైనా ఆలోచించారా? శరీర ఆకృతి దీనికి కారణమా? లేదా ఏదైనా శాస్త్రీయ కారణం ఉందా? దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుకోవడానికి కింది ఆర్టికల్ చదవండి. By Archana 05 Jan 2025 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update షేర్ చేయండి 1/7 దేశంలోని పలు రాష్ట్రాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఉదయం 7 గంటలు దాటినా పొగమంచుతో మూసుకుపోయి.. ప్రజలు గజగజ వణికిపోతున్నారు. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పురుషులతో పోలిస్తే స్త్రీలు ఎక్కువ చలిని అనుభవిస్తారట. 2/7 అయితే శరీర ఆకృతి , పరిమాణం బయట వాతావరణంతో సంబంధం కలిగి ఉంటుంది. పురుషులతో పోలిస్తే స్త్రీలు తక్కువ కండరాలు కలిగి ఉంటారు. కండరాలు సహజంగా వేడిని ఉత్పత్తి చేస్తాయి. అంతేకాదు మహిళలు పురుషుల కంటే 6-11శాతం ఎక్కువ శరీర కొవ్వును కలిగి ఉంటారు. ఇది అంతర్గత వేడిని ప్రసరింపజేసే రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. 3/7 జీవక్రియ చాలా మంది స్త్రీలలో జీవక్రియ రేటు చాలా తక్కువగా ఉంటుంది. దీని కారణంగా శరీరంలో తక్కువ వేడి ఉత్పత్తి అవుతుంది. శరీరంలో ఉష్ణోగ్రత తగ్గడం ద్వారా ఆడవారికి మరింత చలిగా అనిపిస్తుంది. 4/7 మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత సాధారణంగా మహిళల్లో పీరియడ్స్ కారణంగా శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. పీరియడ్స్ కారణంగా ఏర్పడే ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్లు హెచ్చుతగ్గులు శరీర ఉష్ణోగ్రతను ప్రభావితం చేస్తాయి. 5/7 ఈస్ట్రోజెన్ శరీర రక్త నాళాలను విస్తరింపజేస్తుంది. అలాగే ప్రొజెస్టెరాన్ రక్త నాళాలను గట్టిగా ఉంచుతుంది. 6/7 రక్తనాళాలు బిగుసుకుపోవడం వల్ల రక్తప్రసరణ తక్కువగా ఉంటుంది. రక్తప్రవాహం తక్కువగా ఉండడం శరీరంలో వెచ్చదనం తగ్గిపోతుంది. దీని వల్ల మహిళలు మరింత చలిని అనుభవిస్తారు. 7/7 గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #winter-tips #life-style మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి