COFFEE: కాఫీ ఈ సమయంలో మాత్రమే తాగాలి.. లేదంటే గుండెపోటు..!

ఉదయం మాత్రమే కాఫీ తాగడం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుందని తాజా పరిశోధనలో తేలింది. అలా కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు టీ, కాఫీలు తాగితే హానికరమని నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం కాఫీ తాగే వారిలో గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం 31% తగ్గినట్లు తేలింది.

New Update
coffee

coffee

Life Style: ఉదయాన్నే ఒక కప్పు కాఫీ లేదా టీ  తాగందే చాలా మందికి డే స్టార్ట్ అవ్వదు. మరికొంతమంది రోజుకు 4-5 సార్లైనా టీ, కాఫీలు తాగుతుంటారు. లేదంటే ఏదో కోల్పోయినట్లు ఫీల్ అవుతారు. అలాంటి వారు ఇకపై తమ అలవాట్లను మార్చుకోవాల్సి ఉంటుంది. తాజా అధ్యయనాల్లో కాఫీకి సంబంధించి షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. కాఫీలో ఉండే కెఫీన్ కారణంగా సరైన సమయంలో, పరిమిత పరిమాణంలో మాత్రమే  తీసుకోవాలని  సూచిస్తున్నారు పరిశోధకులు. ఇష్టానుసారంగా సమయ పాలన లేకుండా  కాఫీలు తాగడం ఆరోగ్యానికి హానికరమని హెచ్చరిస్తున్నారు. 

Also Read: Game Changer: దుమ్మురేపుతున్న గేమ్ ఛేంజర్ అడ్వాన్స్ బుకింగ్స్.. ఎన్ని కోట్లంటే!

టీ తాగడానికి సరైన సమయం.. 

యూరోపియన్ హార్ట్ జర్నల్‌లో అధ్యయనం ప్రకారం.. ఉదయాన్నే కాఫీ తాగడం ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఉదయం మాత్రమే  కాఫీ తాగే వారిలో గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం 31% తగ్గినట్లు తేలింది. అంతేకాదు ఇతర కారణాల వల్ల మరణించే ప్రమాదం కూడా 16% తగ్గింది. ఈ ప్రయోజనాలన్నీ ఉదయం కాఫీ తాగేవారిలో మాత్రమే కనిపిస్తాయి. అలా కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు టీ, కాఫీలు తాగితే ఆరోగ్యానికి హానికరం. అయితే దీనికి సంబంధించి ఇంకా పరిశోధన జరగాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి: Tirupati Stampede: తొక్కిసలాటకు కారణం అదే.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!

మిగతా సమయాల్లో కంటే ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల.. దానిలోని కెఫిన్ మెదడును ఉత్తేజపరుస్తుంది. అలాగే రోజంతా శరీరాన్ని శక్తివంతంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఎప్పుడు పడితే అప్పుడు కాఫీలు తాగడం ద్వారా శరీరంలో హార్మోన్ స్థాయిలు ప్రభావితం అవుతాయి. దీంతో పాటు గుండె, రక్తపోటు సమస్యలను కూడా ప్రభావితం చేస్తుంది.  

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read :  మహారాష్ట్రలో ఘోరం.. రూ. 500 కోసం సొంత తమ్ముడి హత్య.. అసలేం జరిగిందంటే ?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు