/rtv/media/media_files/2025/02/16/e1Vwgt4NhlamprcjDo9g.jpg)
coconut water during pregnancy
Coconut Water: సాధారణంగా మహిళల్లో గర్భధారణ సమయంలో అనేక శారీరక, మానసిక మార్పులు వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో తినే ఆహారాలు, పానీయాలు, జీవన శైలి విధానాలపై ప్రత్యేక శ్రద్ద వహించాలని సూచిస్తారు నిపుణులు. అయితే కొంతమందికి గర్భధారణ సమయంలో కొబ్బరి నీళ్ళు తాగాలా? వద్దా అనే సందేహం ఉంటుంది. దీనిపై నిపుణులు ఎలాంటి సలహాలు ఇస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read: Chhaava Day 2 Collections: రెండు రోజుల్లోనే 100 కోట్ల దిశగా.. 'చావా' బాక్సాఫీస్ సంచలనం
కొబ్బరి నీటితో ప్రయోజనాలు
గర్భిణీ స్త్రీలకు కొబ్బరి నీళ్లను చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. అయితే కొబ్బరి నీళ్లకు ఎలాంటి అలెర్జీ లేనివారు వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవచ్చు. కొబ్బరి నీళ్ళు క్లోరైడ్, ఎలక్ట్రోలైట్స్, రిబోఫ్లేవిన్, కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ సి వంటి పోషకాలతో నిండి ఉంటాయి. వీటిలో కొవ్వులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. అలాగే శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడంలో సహాయపడతాయి. రోగనిరోధక శక్తిని, మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తాయి. గర్భధారణ సమయంలో వాంతులు లేదా ఛాతిలో మంటగా అనిపిస్తే కొబ్బరి నీళ్లు తాగడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
Also Read: Prabhas Spirit Casting Call: డార్లింగ్ ఫ్యాన్స్ కు బంపర్ ఆఫర్.. ఆ సినిమాలో నటించే అవకాశం..!
ఎన్ని నెలలు తాగాలి?
తొమ్మిది నెలలు కొబ్బరి నీళ్లను తాగవచ్చుని సూచిస్తున్నారు నిపుణులు. రోజుకు ఒక కొబ్బరి బోండా సరిపోతుందని గుర్తుంచుకోండి. అతిగా తాగడం వల్ల కూడా హాని జరుగుతుంది. ముఖ్యంగా సాయంత్రం సమయంలో కొబ్బరి నీళ్లు తాగడం మానుకోవాలి. గర్భిణీ స్రీలు ఏదైనా ఆహారంలో చేర్చే ముందు వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
Also Read: Malayalam Film Industry: మలయాళం ఇండస్ట్రీలో అన్నీ బంద్.. జూన్ 1 నుంచి ఏం జరగబోతుందంటే