/rtv/media/media_files/2025/02/03/077cCQehnvFCsaFYXSwY.jpg)
parenting tips
Parenting Tips: పిల్లల ఎదుగుదలలో సరైన పేరెంటింగ్ అనేది చాలా ముఖ్యమైనది. సరైన పేరెంటింగ్ లేకపోవడం పిల్లల భవిష్యత్తు పై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. పిల్లల వ్యక్తిత్వాన్ని మెరుగుపరచడంలో లేదా పాడుచేయడంలో తల్లిదండ్రులు ముఖ్య పాత్ర పోషిస్తారు. అయితే కొన్ని విషయాల్లో పిల్లల పట్ల తల్లిదండ్రుల అతిజాగ్రత్త వారిని సోమరిపోతులుగా చేస్తుంది. పిల్లల విషయంలో తల్లిదండ్రులు చేసే తప్పులేంటో ఇక్కడ తెలుసుకుందాం..
సమస్యల పరిస్కరం..
సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్న చిన్న సమస్యలు కూడా రాకుండా చూసుకుంటారు. ఒకవేళ ఏదైన సమస్య ఉన్నా.. పిల్లల వరకు రాకుండా తామే పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారు. దీనివల్ల వారిలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లడం మొదలవుతుంది. అలాంటి పిల్లలు పెద్దయ్యాక కూడా తమ జీవితానికి సంబంధించిన ఏ పెద్ద నిర్ణయాన్ని స్వయంగా తీసుకోలేరు. ప్రతిదానికి తల్లిదండ్రులపై పూర్తిగా ఆధారపడతారు. తల్లిదండ్రులు పిల్లలకు కొన్నిసార్లు కష్టపడే అవకాశం ఇవ్వాలి. తద్వారా వారికి సమస్యలను సాల్వ్ చేసుకోగలిగే స్వయం శక్తి పెరుగుతుంది.
తల్లిదండ్రుల చెడు అలవాట్లు
చాలా మంది తల్లిదండ్రులు తమ సమయాన్ని టీవీ, ఫోన్‌లో చూడటంలో గడిపేస్తారు. అదే విధంగా పిల్లలు కూడా తమ మనస్సును చదువుల నుంచి మళ్లించి పేరెంట్స్ ని కాపీ చేయడం ప్రారంభిస్తారు. ఇది పిల్లల సమయాన్ని వృథా చేయడమే కాకుండా అతని సృజనాత్మకతను దెబ్బతీస్తుంది. తల్లిదండ్రులు పిల్లల సమస్యలను వినడానికి వీలైనంత సమయాన్ని కేటాయించాలి.
పిల్లల పనులు చేయడం
చాలామంది తల్లిదండ్రులు పిల్లల పై అతిప్రేమతో వారిపట్ల మరీ సానుకూలంగా ప్రవర్తిస్తారు. పిల్లలు కష్టపడడం చూడలేక వారి స్కూల్ కి సంబంధించిన హోమ్ వర్క్, ఇతర పనులకు కూడా స్వయంగా చేసి పెడతారు. దీనివల్ల పిల్లలు భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడతారు. తమ స్వంత పనులను కూడా చేసుకోలేరు.. సోమరితనం కూడా వచ్చేస్తుంది. అందువల్ల పిల్లలను తమ పనులు తాము చేసుకోవడానికి ప్రోత్సహించాలి. అవసరమైతే వారికి సహాయం చేయాలి.. అంతే కానీ మీరే పని మొత్తం చేయకూడదు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.