/rtv/media/media_files/2025/01/13/dHJrYch0uEt7hGWq9BS3.jpg)
bad smell urine
Urine: సాధారణంగా చాలా మందిలో మూత్రం రంగు మారడం ఆందోళన కలిగిస్తుంది. అయితే రంగు మాత్రమే కాదు యూరిన్ వాసన కూడా అనారోగ్యనికి సంకేతం. మూత్రం దుర్వాసన రావడం తీవ్రమైన వ్యాధులకు సంకేతమని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మూత్రం దుర్వాసన ఈ వ్యాధులకు సంకేతం
మధుమేహం..
యూరిన్ నుంచి బలమైన దుర్వాసన రావడం మధుమేహం ప్రారంభ లక్షణం కావచ్చు. రక్తంలో చక్కర స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు యూరిన్ వాసన వస్తుంది. ముఖ్యంగా ఏదైనా పండ్ల వాసన లేదా తీపి వాసనలా అనిపిస్తే రక్తంలో చక్కర స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Also Read : మోదీ చేతుల మీదుగా నేడు జడ్ మోడ్ టన్నెల్ ఓపెనింగ్
బాక్టీరియల్ వాజినోసిస్
బాక్టీరియల్ వాజినోసిస్ అనేది మహిళల యోనిలో సంభవించే ఒక రకమైన ఇన్ఫెక్షన్. యూరిన్ నుంచి దుర్వాసన రావడం బాక్టీరియల్ వాజినోసిస్ ఇన్ఫెక్షన్ కి దారి తీసే ప్రమాదం ఉంది. మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పి యోనిలో దురద, మంట ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. యోనిలో సహజ బ్యాక్టీరియా పెరుగుదల కారణంగా బాక్టీరియల్ వాజినోసిస్ ఇన్ఫెక్షన్ వస్తుంది.
Also Read : బాలయ్య ఫ్యాన్స్కు బిగ్ షాక్.. ఆన్లైన్ లో డాకు మహారాజ్ HD ప్రింట్
కిడ్నీ సంబంధిత సమస్యలు..
మూత్రం నుంచి వచ్చే అసాధారణ వాసన కిడ్నీ సంబంధిత వ్యాధికి కూడా సంకేతం కావచ్చు. శరీరంలో టాక్సిన్ పరిమాణం పెరుగడం ఈ సమస్య మరింత పెరుగుతుంది. కొంతకాలం తర్వాత ఇది మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి.
Also Read : ఆఫర్ అదిరింది గురూ.. సంక్రాంతి పండుగకు జియో గుడ్‌న్యూస్
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్
UTI యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది ఒక రకమైన బాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఇది పురుషుల కంటే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. మూత్ర నాళంలో ఈ ఇన్ఫెక్షన్ కారణంగా, మూత్రం నుంచి దుర్వాసన వస్తుంది. దీంతో పాటు మీకు ఏదైనా దురద, మంట ఉంటే నిర్లక్ష్యం చేయవద్దు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
Also Read: Sankranti: సంక్రాంతి రోజు ఇలాంటి రంగులతో ముగ్గు వేస్తే.. అందరి చూపు మీ ఇంటి వైపే!