Sankranti 2025: సంక్రాంతి పండగ వచ్చిందంటే ప్రతి ఇంటి ముందు రంగురంగుల రంగవల్లులు దర్శనమిస్తాయి. హరిదాసుల రాక, కోడి పందేలు, భోగిమంటలతో సంబరాలు అంబరాన్నంటుతాయి. మగువలు ఇంటి ముందు సందర్భానికి తగ్గట్లు చెరుకు గడలు, గంగిరెద్దు, హరిదాసు పొంగల్ కుండలు, చుక్కల ముగ్గులు(Sankranti muggu) అబ్బో ఒకటేంటి.. ఇలా రోజుకో ముగ్గు వేసి మురిసిపోతారు. అందరి కంటే తమ ఇంటి ముందు ముగ్గే అందంగా కనిపించాలని పోటీపడీ మరీ వేస్తుంటారు. నెల రోజుల ముందు నుంచే ఏ డిజైన్ వేయాలి? ఎన్ని చుక్కల ముగ్గు వేయాలి? ఏం కలర్స్ వేయాలి అబ్బో ఇలా ఎంతో హడావిడి చేస్తారు. అయితే మీరు వేసిన ముగ్గు అందంగా కనిపించాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. Also Read: మావోయిస్టులను చంపేందుకు రూ.5,601 కోట్లు.. మరింత పెంచే ఛాన్స్! ముగ్గు అందంగా కనిపించడానికి టిప్స్ చాలా మంది పెద్ద పెద్ద ముగ్గులను ఎంతో అందంగా వేస్తుంటారు. అయితే ఇలా పెద్దగా వేయడం అందరి వల్ల కాదు. ఇలాంటి సమయంలో వేసేది చిన్న ముగ్గయినా సరే అందంగా వేస్తే సరిపోతుంది. ముగ్గులు రానివారు ముందుగానే ఇంటర్నెట్ లో చిన్నగా అందంగా కనిపించే ముగ్గులను సెర్చ్ చేసి పేపర్ పై ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత వాకిట్లో వేయండి. Sankranti muggu ముగ్గు అందంగా కనిపించాలంటే ముందు చుక్కలు సరిగ్గా పెట్టాలి. లేదంటే ముగ్గు పాడవుతుంది. ముగ్గులో ప్రతి చుక్క సరైన దూరంలో ఉండేలా పెట్టాలి. అప్పుడే ముగ్గు అందంగా కనిపిస్తుంది. మొదటి సారి ముగ్గు వేసేవారు ఎప్పుడూ కూడా డైరెక్ట్ గా ముగ్గు పిండితో వేయకూడదు. ముందుగా చాక్ పీస్ తో వేసిన తర్వాత దానిపై ముగ్గు పిండి వేయండి. ఇలా చేయడం ఏవైనా తప్పులు చేస్తే కరెక్ట్ చేసుకోవచ్చు. Sankranti designs ముగ్గు వేసిన తర్వాత వాటిలో రంగులు నింపడం చాలా ముఖ్యం. ఇదే మీ ముగ్గు అందాన్ని పెంచుతుంది. ఎప్పుడూ కూడా ముగ్గు కోసం బ్రైట్ కలర్స్ ఎంచుకోండి. ఇవి ముగ్గును బాగా హైలైట్ చేస్తాయి. చివరిగా రంగులు వేసిన తర్వాత మరోసారి ముగ్గుపిండితో ఔట్ లైన్ వేయండి. ఇలా చేస్తే ముగ్గు అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. ఆ తర్వాత ముగ్గు మధ్యలో గొబ్బెమ్మ, ధాన్యాలు పెడితే మీ ముగ్గు సూపర్ అంతే!