/rtv/media/media_files/2025/04/09/adPGkY222PM5yfqVy0CP.jpg)
life style 20-20-20 formula
Life Style ప్రజెంట్ జనరేషన్ లో టెక్నాలజీ వినియోగం బాగా పెరిగిపోయింది. ప్రతీపనికి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పై ఆధారపడడం అలవాటైపోయింది. ఈ క్రమంలో గంటల తరబడి మొబైల్స్, స్క్రీన్స్ ముందే సమయాన్ని గడిపేస్తున్నాము. అయితే దీని వల్ల భవిష్యత్తులో ఆరోగ్యంపై పై ఎలాంటి ప్రభావం పడుతుందో ఆలోచించలేకపోతున్నారు. అధిక స్క్రీన్ టైం కంటి ఆరోగ్యాన్ని క్రమంగా దెబ్బతీస్తుంది. అంతేకాదు ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా కారణమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో స్క్రీన్ నుంచి కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వైద్యులు 20-20-20 నియమాన్ని సిఫార్సు చేస్తున్నారు. అసలు 20-20-20 నియమం అంటే ఏంటి అనేది ఇక్కడ తెలుసుకుందాం..
20-20-20 ఫార్ములా ఏమిటి?
20-20-20 నియమంలో ప్రతి 20 నిమిషాలకు ఒకసారి మొబైల్ లేదా కంప్యూటర్ నుంచి బ్రేక్ తీసుకోవాలి. గంటల తరబడి స్క్రీన్ చూసిన తర్వాత కళ్ళు అలసట నుంచి ఉపశమనం పొందడానికి కనీసం 20- 30 బ్రేక్ తప్పనిసరిగా తీసుకోవాలి. లేదంటే కళ్ళు ఒత్తిడికి గురవుతాయి. దీంతో పాటు ఎల్లప్పుడూ హైడ్రేటెడ్ గా ఉండడం చాలా ముఖ్యం.
పరిశోధన ఏమి చెబుతుంది?
అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆప్తాల్మాలజీ ప్రకారం, డిజిటల్ పరికరాలు ఖచ్చితంగా కంటి చూపును బలహీనపరచవు, కానీ అవి కళ్ళపై ఒత్తిడిని కలిగిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. సాధారణంగా కళ్ళు ప్రతి నిమిషానికి 15 సార్లు రెప్ప వేస్తాయి. కానీ మనం గంటలు గంటలు స్క్రీన్ వైపు చూడడం వల్ల రెప్పపాటు సమయం సగం లేదా మూడింట ఒక వంతుకు తగ్గుతుంది. దీని కారణంగా కళ్ళు పొడిబారడం, చికాకు, అలసటగా ఉంటాయి. స్క్రీన్ చూడటం వల్ల కలిగే ఒత్తిడిని కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంటారు. దీనిని నివారించడానికి 20-20-20 నియమం సహాయపడుతుందని నిపుణుల సూచిస్తున్నారు.
telugu-news | latest-news | life-style | eye-health | computer eye strain
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.