రోజు స్నానం చేసినా.. శరీరంలో ఒక పార్ట్ మాత్రం మురికిగానే ఉంటుంది..?

నిపుణుల అధ్యయనాల ప్రకారం బొడ్డు 2,368 జాతుల బ్యాక్టీరియాను కలిగి ఉంటుంది. అధిక బరువు, టైప్ 2 డయాబెటీస్ ఉన్నవారిలో బాక్టీరియా పెరుగుదల ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలిపారు. బొడ్డు ప్రాంతాన్ని శుభ్రపరచడానికి వెచ్చని సబ్బు నీటితో తడిపిన గుడ్డను ఉపయోగించండి.

New Update
bathing1 (1)

bathing1

Life Style: ఆరోగ్యంగా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యం. ప్రతిరోజూ స్నానం చేయడం ద్వారా శరీర భాగాలు శుభ్రంగా ఉంటాయి. అయితే ఎంత శుభ్రంగా స్నానం చేసినప్పటికీ శరీరంలో ఒక భాగం మాత్రం మురికిగానే ఉంటుంది. అదేంటో మీకు తెలుసా..? 

Also Read: అయ్యో.. ఆ నర్సు గుర్తు పట్టకపోతే.. కులశేఖర్ చనిపోయిన విషయం కూడా తెలిసేది కాదు..!

2,368 జాతుల బ్యాక్టీరియా

అయితే శరీరంలో నాభీ(బొడ్డు) ప్రాంతం క్రమం తప్పకుండా శుభ్రం చేసినప్పటికీ.. ఆ ప్రాంతాల్లో దుమ్ము, బ్యాక్టీరియా అలాగే పేరుకుపోతుంది. 2012లో PLOS One నివేదిక ప్రకారం.. బొడ్డులో 2,368 జాతుల బ్యాక్టీరియాను కలిగి ఉంటుందని పేర్కొన్నారు. బొడ్డు నిర్మాణం, ఆకారం కారణంగా శుభ్రం చేయడం చాలా కష్టంగా ఉంటుంది. తద్వారా బొడ్డు నుంచి దుర్వాసన వస్తుంది.  అలాగే ఈ ప్రదేశం బ్యాక్టీరియా సంతానోత్పత్తికి అనువుగా ఉంటుంది. టొరంటో క్లినిక్ నివేదిక ప్రకారం.. అధిక బరువు, టైప్ 2 డయాబెటీస్, ఇన్ గ్రోన్ బొడ్డు ఉన్నవారికి  బొడ్డులో  బాక్టీరియా పెరుగుదల అవకాశం ఉందని తెలిపారు.  బొడ్డు ప్రాంతాన్ని శుభ్రపరచడానికి వెచ్చని సబ్బు నీటితో తడిపిన గుడ్డను ఉపయోగించండి. అలాగే బొడ్డు ప్రాంతంలో ఇన్ఫెక్షన్, అధిక దుర్వాసన, నొప్పి వంటి సమస్యలను అనుభవిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. 

Also Read:Pawan Kalyan: మెగా ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. పవన్ నిర్ణయంతో అంతా అయోమయం?

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. 

Also Read: ప్రేమ పాటలతో యువతను ఉర్రూతలూగించాడు.. కానీ ఆ ఒక్క తప్పే అతని జీవితాన్ని మార్చేసింది?

Also Read: అడ్వాన్స్ బుకింగ్స్ లో 'పుష్ప2' ర్యాంపేజ్.. ఎన్ని టికెట్స్ అమ్ముడయ్యాయంటే?

Advertisment
తాజా కథనాలు