Pawan Kalyan: మెగా ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. పవన్ నిర్ణయంతో అంతా అయోమయం?

'పుష్ప2' మూవీ రిలీజ్ వేళ పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయంపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో రచ్చ జరుగుతోంది. మెగా ఫ్యాన్స్ పవన్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్.. అల్లు అర్జున్ సినిమాకు సానుకూలంగా స్పందించడం మెగా అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు.

New Update
mega

అల్లు అర్జున్ 'పుష్ప2' మూవీ రిలీజ్ వేళ పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయంపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో రచ్చ జరుగుతోంది. దీనిపై మెగా ఫ్యాన్స్ పవన్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్.. అల్లు అర్జున్ సినిమాకు సానుకూలంగా స్పందించడం మెగా అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు.

Also Read: 'గోదారి గట్టు మీద రామ చిలకవే' సాంగ్ వచ్చేసింది..రమణ గోగుల ఈజ్ బ్యాక్

అసలేం జరిగిందంటే..

'పుష్ప2' టికెట్ రెట్ల పెంపునకు మొదట తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దాంతో టికెట్ రేట్లు ఓ రేంజ్ లో పెరిగాయి. అయితే ఎపీలోనూ టికెట్ రేట్లు పెంచుకునేందుకు నిర్మాతలు ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. కానీ ప్రభుత్వం వెంటనే తమ నిర్ణయాన్ని చెప్పలేదు. దీంతో ఏపీలో 'పుష్ప2' టికెట్ రేట్ల పెంపుకు పర్మిషన్ ఇవ్వరనే టాక్ వినిపించింది. దానికి కారణం అల్లు- మెగా ఫ్యామిలీ విభేదాలే. 

Also Read : ఏపీలో ‘పుష్ప2’ టికెట్‌ ధరల పెంపు.. అక్కడ టికెట్ రేట్లు ఎలా ఉన్నాయంటే?

పవన్ పై మెగా ఫ్యాన్స్ అసహనం..

బన్నీ ఇటీవల ఎలక్షన్స్ టైం లో పవన్ ను కాదని వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేయడం ఆ విభేదాలకు మరింత ఆజ్యం పోసినట్లయింది. దాంతో 'పుష్ప2' టికెట్ రేట్ల పంపుకు పర్మిషన్ ఇవ్వొద్దని ఫ్యాన్స్ తో పాటూ పలువురు జనసేన నాయకులు సైతం బహిరంగంగానే చెప్పారు. కానీ చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్.. 'పుష్ప2' టికెట్ రేట్ల పంపుకు పర్మిషన్ ఇచ్చారు. దీంతో మెగా ఫ్యాన్స్ పవన్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

నిజానికి ఎప్పుడైతే అల్లు అర్జున్.. ఎలక్షన్ టైంలో పవన్ ను కాదని వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేశాడో అప్పట్నుంచి మెగా హీరోలంతా బన్నీని దూరం పెట్టడం స్టార్ట్ చేశారు. రీసెంట్ గా నాగబాబ, వరుణ్ తేజ్.. అల్లు అర్జున్ పై ఇన్ డైరెక్ట్ కామెంట్స్ చేస్తూ అటాక్ చేశారు. 

ప్రీ రిలీజ్ లో కనిపించని మెగా హీరోలు ..

ఇక నిన్న జరిగిన 'పుష్ప2' ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ మెగా హీరోలెవ్వరూ కనిపించలేదు.  మెగాస్టార్ ఈ ఈవెంట్ కి వస్తున్నారని న్యూస్ వచ్చినప్పటికీ లాస్ట్ మినిట్ లో ఆయన కూడా హ్యాండ్ ఇచ్చాడు. అల్లు అర్జున్ సినిమాను మెగా హీరోలంతా బాయ్ కాట్ చేస్తే.. పవన్ మాత్రం బన్నీకి సపోర్ట్ గా టికెట్ రేట్లు పెంచుకునేందుకు వీలు కల్పించడం అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు. దీనిపై నెట్టింట పెద్ద డిస్కషనే నడుస్తోంది.

Also Read: TG Crime: హైదరాబాద్‌లో విషాదం..  నారాయణ కాలేజీలో మరో విద్యార్థి మృతి

Advertisment
Advertisment
తాజా కథనాలు