/rtv/media/media_files/2025/10/10/copper-t-side-effects-2025-10-10-16-06-55.jpg)
copper t side effects
Copper T: ఈ మధ్య వివాహిత మహిళల్లో(Married Womens) అవాంఛిత గర్భధారణను నివారించడానికి 'కాపర్ టి ' పరికరాన్ని ఎక్కువగా వాడుతున్నారు. గర్భ నిరోధక మాత్రలు, కండోమ్స్ కంటే కూడా దీనిని సురక్షితమైన, ఆరోగ్యకరమైన ఎంపికగా పరిగణిస్తున్నారు. ఈ కాపర్ టి అనేది రాగి, ప్లాస్టిక్ మిశ్రమంతో తయారు చేయబడిన ఒక చిన్న పరికరం. దీనిని మహిళల గర్భాశయంలో చొప్పించడం ద్వారా అవాంఛిత గర్భాన్ని నిరోధించవచ్చు. ప్రతి రోజు పిల్స్ వేసుకునే అవసరం లేకుండా చాలా సంవత్సరాల పాటు ఇది రక్షణ అందిస్తుంది. మీకు ఎప్పుడు పిల్లలు కావాలనిపిస్తే అప్పడు డాక్టర్ చేత దీనిని సులభంగా తీయించేసుకోవచ్చు. తీసిన తర్వాత మళ్ళీ నార్మల్ గా గర్భం దాల్చే అవకాశం ఉంటుంది.
అయితే ఈ 'కాపర్ టీ' వినియోగం పూర్తిగా సురక్షితమైనది కాదని చెబుతున్నారు నిపుణులు. దీనిని గర్భాశయంలో సరైన స్థానంలో ప్లేస్ చేయకపోతే మహిళల్లో అనేక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అవేంటో ఇక్కడ తెలుసుకోండి..
Also Read : గుప్పెడు మొలకెత్తిన ధాన్యం.. బొడ్డు చుట్టూ కొవ్వు మాయం!!
కాపర్ టి దుష్ప్రభావాలు
కాపర్ టి పరికరాన్ని తప్పుగా ప్లేస్ చేయడం ద్వారా మహిళలు మూత్ర విసర్జన సమయంలో అసౌకర్యం, ఇబ్బంది తలెత్తే ప్రమాదం ఉంటుంది. అలాగే పొత్తి కడుపులో నొప్పి, వైట్ డిశ్చార్జ్, అసౌకర్యాన్ని కలిగిస్తుంది.
తీవ్రమైన నొప్పి
కాపర్ Tని సరైన స్థానంలో ఉంచకపోవడం వల్ల ఇంటర్ కోర్స్( లైంగిక సంపర్కం) సమయంలో రక్తస్రావం, తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది.
రక్తస్రావం, నొప్పి
కొన్నిసార్లు పీరియడ్స్ సమయంలో భారీ రక్తస్రావం, నొప్పిని కలిగిస్తాయి. చాలా మంది స్త్రీలు 12 నుంచి 15 రోజుల పాటు ఉండే స్పాటింగ్ లేదా పీరియడ్స్‌ను అనుభవిస్తారు.
ఇన్ఫెక్షన్లు, దద్దుర్లు
రాగి అలెర్జిక్ ఉన్న మహిళల్లో ఇది ప్రైవేట్ భాగాలలో దద్దుర్లు, దురదకు దారితీస్తుంది. ఇలాంటి సమస్య ఎదుర్కునే వారు డాక్టర్ తో సంప్రదించి వెంటనే కాపర్ T ని తొలగించడం మంచిదని నిపుణుల సలహా.
గర్భాశయానికి గాయం
కొంతమంది యూట్యూబ్, గూగుల్ సహాయంతో కాపర్ టి ని అమర్చుకోవడం చేస్తుంటారు . కానీ, ఇలా చేయడం చాలా పెద్ద తప్పు! నిపుణుల సహాయంతోదీనిని చొప్పించకపోతే.. కొన్నిసార్లు గర్భాశయంలో రాపిడికి కారణమవుతుంది. దీని వల్ల గర్భాశయ లైనింగ్‌కు గాయపడడం, రక్తస్రావం కూడా వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి పరిస్థితి ఉన్నవారు వెంటనే కాపర్ టి ని తొలగించాలి.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
Also Read: Nikita Dutta: ఎద అందాలు చూపిస్తూ నిఖిత స్టన్నింగ్ ఫొటోస్.. ఫ్లాట్ అవుతున్న కుర్రాళ్లు!