/rtv/media/media_files/2025/08/01/telangana-beer-2025-08-01-17-56-29.jpg)
చల్లగా ఉండే బీరు అంటే యూత్ కు చాలా ఇష్టం. ముఖ్యంగా కింగ్‌ఫిషర్ బీరు పడి చచ్చిపోతారు. ఇందులో ఉండే యునీక్ సాఫ్ట్ టేస్ట్ చాలా బాగుంటుందని చెబుతుంటారు. ఫ్రెండ్స్ నలుగురు కలిస్తే బీరు లేకుండా దావత్ అసలే ఉండదు. అయితే ఒక బీరు తయారీకి అయ్యే ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది, కానీ టాక్సులు, ఇతర ఖర్చుల వల్ల దాని ధర విపరీతంగా పెరుగుతుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం, ఒక బీరు (కింగ్‌ఫిషర్ వంటి ప్రముఖ బ్రాండ్) తయారీకి అయ్యే అసలు ఖర్చు సుమారుగా రూ. 30 ఉండవచ్చు. ఈ అసలు ధరపై అనేక పన్నులు, మార్జిన్‌లు జోడించబడిన తర్వాత తుది ధర నిర్ణయించబడుతుంది.
ప్రస్తుతం తెలంగాణలో ఒక సాధారణ బీరు ధర రూ. 180 నుండి రూ. 200 మధ్య ఉంది. కొన్ని ప్రీమియం బ్రాండ్‌ల ధరలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. ఒక బీరు బాటిల్‌పై దాదాపు రూ. 70 వరకు ఎక్సైజ్ టాక్స్ ఉంటుంది. ఇది ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు అని చెప్పాలి. వాల్యూ యాడెడ్ టాక్స్ (VAT) సుమారు రూ. 35 వరకు ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్, రిటైలర్ మార్జిన్ ఇది దాదాపు రూ. 20 ఉంటుంది. తయారీ కంపెనీ లాభం ఇది సుమారు రూ. 15 ఉంటుంది. రవాణా ఖర్చులు ఇది సుమారు రూ. 10 వరకు ఉంటుంది. ఇవన్ని కలిపితే ఫైనల్ గా రేటు రూ. 180 నుంచి రూ. 200 అవుతుంది. ఇందులో ఎక్కువ భాగం సుమారు 70-80% ప్రభుత్వానికి పన్నుల రూపంలోనే వెళ్తుందన్న మాట. తెలంగాణ ప్రభుత్వం 2025 ఫిబ్రవరిలో బీరు ధరలను 15% పెంచింది. ఈ పెంపు వల్ల వివిధ బ్రాండ్ల ధరలు రూ.30 నుంచి రూ. 50 వరకు పెరిగాయి. ఉదాహరణకు కింగ్‌ఫిషర్ లైట్ బీరు పాత ధర రూ. 150 ఉండగా, ఇప్పుడు రూ. 180కి పెరిగింది. కింగ్‌ఫిషర్ స్ట్రాంగ్ పాత ధర రూ. 160 ఉండగా, ఇప్పుడు రూ. 190కి పెరిగింది. ఈ ధరల పెంపుతో రాష్ట్ర ఖజానాకు భారీగానే ఆదాయం సమకూరింది.
Also Read : వైట్, బ్లూ, మెరూన్.. మూడు పాస్‌పోర్ట్ రంగుల్లో దాగున్న రహస్యం ఇదే!
స్ట్రాంగ్ బీరు vs లైట్ బీరు
ఆరోగ్యం దృష్ట్యా చూస్తే, స్ట్రాంగ్ బీరు కంటే లైట్ బీరు మంచిది. దీనికి ప్రధాన కారణం, లైట్ బీరులో ఆల్కహాల్ శాతం, కేలరీలు తక్కువగా ఉంటాయి. స్ట్రాంగ్ బీరులో ఆల్కహాల్ బై వాల్యూమ్ (ABV) సుమారు 5.6% నుంచి 8.5% లేదా అంతకంటే ఎక్కువగా ఉంటుంది. లైట్ బీరులో ABV సాధారణంగా 2.6% నుంచి 4.0% వరకు ఉంటుంది. కొన్ని లైట్ బీర్లలో 5% వరకు కూడా ఉండవచ్చు, కానీ అవి స్ట్రాంగ్ బీరుతో పోలిస్తే తక్కువగానే ఉంటాయి.
మితంగా బీరు తాగడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. మితంగా బీరు తాగడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. బీరులో ఉండే సిలికాన్ అనే మినరల్ ఎముకలను బలంగా ఉంచడంలో సహాయపడుతుంది. బీరు కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశాన్ని తగ్గిస్తుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఎక్కువ మోతాదులో ఆల్కహాల్ తాగడం వల్ల కాలేయం, గుండెకు సంబంధించిన వ్యాధులు, అధిక బరువు వంటి సమస్యలు వస్తాయి.
Also Read : ట్రాన్స్‌జెండర్ నుంచి డబ్బులు తీసుకుంటే మీకు మంచిదా? అసలు మ్యాటర్ ఇదే!
telangana liquor sales | Strong Beer | Light Beer | Kingfisher Beer | latest-telugu-news | healthy life style | daily-life-style | human-life-style