శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు కేరళ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. శబరిమల స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు స్వామి పేరుతో కొత్త చాట్‌బాట్‌ను తీసుకొచ్చింది. నవంబర్ 15వ తేదీ నుంచి మండల మకరు విళక్కు పూజ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని కేరళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్వామి చాట్‌బాట్ లోగోను ఆవిష్కరించారు.
ఇది కూడా చూడండి: ఉత్కంఠంగా సాగిన మూడో టీ20..భారత్ విజయం
మొత్తం ఆరు భాషల్లో..
ఈ చాట్‌బాట్‌ను ముత్తూట్ గ్రూప్ సహకారంతో కేరళ ప్రభుత్వం రూపొందించారు. శబరిమల గురించి పూర్తి వివరాలను స్మార్ట్‌ఫోన్‌లో మీకు కావాల్సిన భాషలో ఈజీగా తెలుసుకోవచ్చు. ఆంగ్లం, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ మొత్తం ఆరు భాషల్లో అన్ని వివరాలు భక్తులు ఈజీగా తెలుసుకోవాలని ఈ చాట్‌బాట్‌ను ప్రభుత్వం రూపొందించింది.
ఇది కూడా చూడండి: ఈరోజే మనకు బాలల దినోత్సవం..ఏఏ దేశాల్లో ఎప్పుడు జరుపుకుంటారో తెలుసా?
శబరిమలలో పూజా సమయం, దర్శన సమయాలు ఇలా అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. వీటితో పాటు విమానాలు, రైళ్లు, స్థానిక వివరాలు, పోలీసులు, అటవీ శాఖ వివరాలు కూడా ఈ స్వామి చాట్‌బాట్ ద్వారా తెలుసుకోవచ్చు. రేపటి నుంచి యాత్ర ప్రారంభం కావడంతో ఇప్పటికే ట్రావెన్‌కోర్ దేవస్థానం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దర్శనం అయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు.
ఇది కూడా చూడండి: Booker Prize: బుకర్‌ప్రైజ్ విజేతగా మొదటిసారి ఓ మహిళ
శబరిమలలో వేకువ జామున 3 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు భక్తులకు దర్శనం కల్పిస్తారు. మళ్లీ తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కొనసాగిస్తారని కేరళ ప్రభుత్వం తెలిపింది. దర్శన సమయాల్లో మార్పుల వల్ల భక్తులకు రోజుకీ 17 గంటల సమయం కేటాయించినట్లు అవుతుంది.
ఇది కూడా చూడండి: కంగువ ట్విట్టర్ రివ్యూ.. సూర్య బ్లాక్ బ్లస్టర్ హిట్ కొట్టినట్లేనా!