Karthika Pournami 2025: నేడే కార్తీక పౌర్ణమి.. ఈ సమయంలో ఆ దీపం వెలిగిస్తే.. మీ జీవితం ఇక ఆనందమయం

కార్తీక పౌర్ణమి తిథి సాయంత్రం 6:47 వరకు ఉంటుంది. ఈ సమయంలో ఉసిరి దీపం శివాలయం లేదా ఇంట్లో వెలిగించడం వల్ల పుణ్యం లభిస్తుందని పండితులు అంటున్నారు. అయితే నెయ్యి వత్తుతో దీపం వెలిగిస్తే ఇంకా ఫలితాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు.

New Update
Amla deepam

Amla deepam

కార్తీక పౌర్ణమి రోజున భక్తులు ఎంతో  పవిత్రంగా పూజిస్తారు. ముఖ్యంగా శివాలయాలకు వెళ్లి అక్కడ కొన్ని రకాల నూనెలతో దీపాలు వెలిగిస్తారు. అయితే కార్తీక పౌర్ణమి రోజంతా కాకుండా కేవలం పౌర్ణమి తిథుల్లో మాత్రమే దీపాలు వెలిగించడం వల్ల మంచి జరుగుతుందని పండితులు అంటున్నారు. అయితే కార్తీక పౌర్ణమి తిథి సాయంత్రం 6:47 వరకు ఉంటుంది. ఈ సమయంలో ఉసిరి దీపం శివాలయం లేదా ఇంట్లో వెలిగించడం వల్ల ప్రయోజనాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

ఇది కూడా చూడండి: Chhath Puja Fasting: ఛత్‌ పూజ ఉపవాసానికి ముందు... శక్తి, తేమ కోసం ఈ పానీయాలు తప్పనిసరి

లక్ష్మీదేవి కొలువై ఉంటుందని..

ఉసిరికాయలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఈ ఉసిరికాయ విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైనదని పండితులు అంటున్నారు. ఈ క్రమంలోనే ఉసిరి చెట్టును కల్పవృక్షంతో సమానంగా భావిస్తారు. కార్తీక పౌర్ణమి నాడు ఉసిరికాయపై దీపం వెలిగించడం ద్వారా లక్ష్మీ నారాయణులను ఏకకాలంలో పూజించిన ఫలితం దక్కుతుంది. ఈ దీపాన్ని ప్రధానంగా ఉసిరి చెట్టు మొదట్లో లేదా ఇంట్లో పూజా మందిరంలో పెడతారు. ఉసిరికాయ లక్ష్మీ స్వరూపం కాబట్టి ఈ దీపం వెలిగిస్తే ఇంట్లో ధన సమృద్ధి, ఐశ్వర్యం పెరుగుతాయని ఆర్థిక కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఉసిరి చెట్టుకు ఆయుర్వేదంలో కూడా గొప్ప స్థానం ఉంది. ఈ దీపం పెట్టడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని నమ్ముతున్నారు. కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి దీపాన్ని పెట్టడం వల్ల గత జన్మలలో చేసిన పాపాలు కూడా తొలగిపోతాయని, పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి దీపం ప్రదోష సమయంలో పెట్టడం మంచిదని పండితులు అంటున్నారు. సాయంత్రం 5:30 PM నుంచి 7:30 PM వరకు దీపం పెట్టడం వల్ల విశేష ఫలితం దక్కుతుందని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో దీపం పెడితే మానసికంగా ప్రశాంతంగా ఉంటారని అంటున్నారు. అయితే ఉసిరి దీపం దేవుడి దగ్గర పెట్టడం వల్ల కోరిన కోరికలు అన్ని కూడా నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. అయితే నెయ్యి వత్తుతో ఉసిరి మీద దీపం పెట్టడం వల్ల మంచిదని పండితులు అంటున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. 

Advertisment
తాజా కథనాలు