/rtv/media/media_files/2025/01/25/1xltAoZKu5f3oCtRZB5y.jpg)
Indian jujube Photograph: (Indian jujube)
శీతాకాలంలో మాత్రమే దొరికే రేగి పండ్లలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. తీపి, పుల్లగా ఉండే వీటిని చాలా మంది ఈ సీజన్‌లో తింటుంటారు. ఇందులో పోషకాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. డైలీ కాకపోయినా వారానికి ఒకసారి అయినా వీటిని తినడం వల్ల బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలియాలంటే ఆలస్యం చేయకుండా ఆర్టికల్ చదివేయండి.
ఇది కూడా చూడండి: Maha Kumbh Mela: కుంభమేళాలో సాధువులుగా టీమిండియా క్రికెటర్లు.. ఫొటోస్ వైరల్
రోగనిరోధక శక్తి పెరుగుదల
ఈ పండ్లలో విటమిన్ సి , యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియా, వైరస్‌లు రాకుండా చేస్తుంది. అలాగే జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి.
జీర్ణక్రియ ఆరోగ్యం
రేగి పండును తినడం వల్ల జీర్ణక్రియ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులోని ఫైబర్ మలబద్ధకం, కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది.
ఇది కూడా చూడండి: Vijaysai Reddy: రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా
రక్తహీనత నుంచి విముక్తి
రేగి పండ్లు తినడం వల్ల రక్తహీనత నుంచి విముక్తి కలుగుతుంది. ఇందులోని ఐరన్ హీమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. అనీమియా సమస్యతో బాధపడేవారు రోజూ వీటిని తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య నుంచి విముక్తి చెందుతారు.
చర్మ ఆరోగ్యం
ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అలాగే చర్మంపై ఉండే ముడతలు, మచ్చలు అన్నింటిని కూడా తగ్గిస్తాయి. ఇందులో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మం మెరిసేలా చేస్తుంది.
ఇది కూడా చూడండి: Republic Day 2025: జాతీయ జెండా ఆవిష్కరించేవాళ్లు ఇవి గుర్తుంచుకోండి!
గుండె ఆరోగ్యం
రేగి పండులో పోటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. దీంతో రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ప్రతి రోజూ రెండు లేదా మూడు రేగి పండ్లను తినడం వల్ల గుండె సంబంధిత సమస్యలు రావు.
ఇది కూడా చూడండి: USA: స్ట్రిక్ట్ గా అక్రమ వలసల చట్టం అమలు..పార్ట్ టైమ్ జాబ్ చేస్తే ఇంటికే..
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.