ఈరోజుల్లో మహిళలు ఎక్కువగా క్యాన్సర్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీని బారిన పడుతున్న వారి సంఖ్య రోజరోజుకీ పెరుగుతోంది. అయితే క్యాన్సర్‌ను గుర్తించడం చాలా కష్టం. అయితే మహిళల శరీరంలో వచ్చే కొన్ని లక్షణాల వల్ల క్యాన్సర్‌ను గుర్తించవచ్చు. మరి ఆ లక్షణాలేంటో చూద్దాం.
నెలసరిలో విపరీతమైన నొప్పి
నెలసరిలో వచ్చే లక్షణాలు మహిళలకు క్యాన్సర్‌కు కారణం అవుతుంది. పీరియడ్స్ సమయంలో విపరీతమైన నొప్పి, రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తే గర్భాశయ క్యాన్సర్‌కు దారితీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ లక్షణం కనిపించిన వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
రొమ్ము ప్రాంతంలో ఉబ్బితే..
ముఖం, రొమ్ము ప్రాంతంలో కాస్త ఉబ్బినట్లు అనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లండి. క్యాన్సర్ లక్షణాల్లో ఇది కూడా ఒకటి.
బరువు తగ్గడం
కారణం లేకుండా అకస్మాత్తుగా బరువు తగ్గిన, పెరిగిన కూడా భయపడాల్సిందే. క్యాన్సర్ రావడానికి ఇది ఒక కారణమే. బరువు తగ్గినట్లు మీకు ఎప్పుడైనా అనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.
చర్మ రంగులో మార్పు
వయస్సు పెరిగితే చర్మం విషయంలో మార్పులు రావడం సహజం. ఎలాంటి కారణం లేకుండా చర్మ రంగులో మార్పులు వచ్చి, ముఖంపై ముడతలు వస్తే టెస్ట్‌లు చేయించుకుని జాగ్రత్త పడాలి.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: Vitamins : 45 ఏళ్ల తర్వాత డైట్‌లో చేర్చుకోవాల్సిన విటమిన్లు ఇవే!