Vitamins : 45 ఏళ్ల తర్వాత డైట్‌లో చేర్చుకోవాల్సిన విటమిన్లు ఇవే!

వయస్సు పెరుగుతున్న కొద్దీ ఎముకలు, కండరాలు బలహీనంగా మారడం వల్ల పోషకాలు, విటమిన్లు ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవాలి. ముఖ్యంగా విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ బీ12 ఉండే పదార్థాలను డైలీ డైట్‌లో చేర్చుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

New Update
Vitamin D :విటమిన్ డి లోపంతో క్యాన్సర్ ప్రమాదం.. షాకింగ్ విషయాలు..

వయస్సు పెరిగే కొద్దీ పోషకాహార లోపం ఏర్పడుతుంది. ముఖ్యంగా 45 ఏళ్ల తర్వాత పోషకాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. అప్పుడే అనారోగ్య సమస్యలు రాకుండా హెల్తీగా ఉంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. మీరు తీసుకునే ఆహారంలో తప్పకుండా ఈ విటమిన్లు తీసుకోవాలి. వయస్సు పెరిగిన తర్వాత ఎముకలు బలహీనంగా మారడం వంటి సమస్యలు వస్తాయి. ఇవన్నీ రాకుండా ఉండాలంటే ఈ విటమిన్లను తప్పకుండా డైట్‌లో చేర్చుకోండి.

విటమిన్ డి
తీసుకునే ఆహార పదార్థాల్లో విటమిన్ డి ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. వయస్సు పెరగడం వల్ల కొందరికి బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. 

విటమిన్ బీ12
ఈ విటమిన్ ఉండే పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. దీనివల్ల శరీరానికి బలం అందడంతో పాటు మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. పాల ఉత్పత్తులు, చేపలు, గుడ్లు వంటివి తీసుకోవడం వల్ల వృద్ధ్యాపంలో మానసిక సమస్యలు రాకుండా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. 

విటమిన్ సి
ఈ విటమిన్‌ను అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా చర్మాన్ని రక్షిస్తుంది. 

విటమిన్ ఎ
వయస్సు పెరిగిన తర్వాత కంటి చూపు తగ్గుతుంది. కాబట్టి విటమిన్ ఎ ఉండే పదార్థాలను తీసుకోవాలి. క్యారెట్, బచ్చలికూర, పాలకూర వంటివి తీసుకోవడం వల్ల కంటి సమస్యలు కాస్త తగ్గుతాయి. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read :  45 ఏళ్ల తర్వాత డైట్‌లో చేర్చుకోవాల్సిన విటమిన్లు ఇవే!

Advertisment
Advertisment
తాజా కథనాలు