Rain Alert: వర్షంలో రోడ్డుపై అడుగు పెట్టే ముందు ఈ జాగ్రత్తలు లేకపోతే ప్రమాదమే!

వర్షంలో రోడ్డుపై సురక్షితంగా ప్రయాణించడానికి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలి! ఇవి మీరు సురక్షితంగా ఇంటికి చేరుకోవడానికి సహాయపడతాయి.  అవేంటో ఇక్కడ తెలుసుకోండి. 

New Update
Rains

Rains

గత వారం రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వానలు(Rains) దంచికొడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్(Hyderabad) లో కాసేపు వానకే రోడ్లన్నీ జలమయమైపోతున్నాయి.  వరద నీటితో డ్రైనేజీలు రోడ్లపై పొంగిపొర్లుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అడుగు బయటపెట్టాలంటేనే భయంగా ఉంది. ఇక ఆఫీసులకు వెళ్లేవారి పరిస్థితి మరింత దారుణం! రోడ్లపై నీరు, పై నుంచి వర్షం, వీటికి తోడు రోడ్డుమీద గుంతలతో ప్రయాణం పెద్ద సవాలుగా మారుతుంది.  ఈ సమస్యల వల్ల యాక్సిడెంట్, బైక్ స్కిడ్ అవ్వడం వంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కావున, ఇలాంటి పరిస్థితుల్లో మీరు రోడ్డుపై సురక్షితంగా ప్రయాణించడానికి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలి! ఇవి మీరు సురక్షితంగా ఇంటికి చేరుకోవడానికి సహాయపడతాయి.  

వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వేగాన్ని తగ్గించండి

కొందరు వర్షం పడుతుందన్న హడావిడిలో వాహనాలను వేగంగా పోనిస్తుంటారు. కానీ, ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు. దీనివల్ల కిందపడిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే తడి రోడ్లపై వేకిల్ టైర్లు తక్కువ పట్టును కలిగి ఉంటాయి. కావున సాధారణ స్పీడ్ కంటే కూడా నెమ్మదిగా వెళ్లడం మంచిది. అంతేకాదు వేగంగా వెళ్తే బ్రేకులు వేసినప్పుడు వాహనం అదుపుతప్పే అవకాశం ఉంటుంది. 

దూరం పాటించండి

మీ వాహనానికి, ముందు వెళ్లే వాహనానికి మధ్య మినిమమ్ దూరం పాటించాలి. వర్షాకాలంలో రోడ్లు తడిగా ఉండడం ద్వారా  బ్రేకులు వేసినప్పుడు వాహనం ఆగేందుకు ఎక్కువ సమయం పడుతుంది. దీనివల్ల ముందున్న వాహనానికి ఢీకొట్టే ప్రమాదం ఉంటుంది. కావున ముందున్న వాహనానికి దగ్గరగా వెళ్లడం ప్రమాదకరం. 

టైర్లు, బ్రేకులు చెక్ చేసుకోవడం.. 

వర్షాకాలంలో బయటకు వెళ్లేముందు మీ వాహనం టైర్లు, సరిగ్గా ఉన్నాయా? లేదా అనే విషయాన్ని చెక్ చేసుకోవాలి. అలాగే బ్రేకులు కూడా పనిచేస్తున్నాయో లేదో నిర్దారించుకోవాలి. 

గుంతల పట్ల జాగ్రత్త

రోడ్లపై  వర్షపు నీటితో నిండిన గుంతలు ఉంటాయి. అవి ఎంత లోతులో ఉన్నాయో మనం ఊహించలేము. కావున వాటిపై నుంచి వెళ్లకుండా, పక్క వైపుగా వెళ్లడం మంచిది.  

హెడ్ లైట్స్ ఆన్ చేయండి

వర్షం పడేటప్పుడు.. ముఖ్యంగా రాత్రి పూట వాహనం హెడ్ లైట్స్ తప్పనిసరిగా ఆన్ చేసుకోవాలి. దీనివల్ల మీ వాహనం ఎదుటివారికి స్పష్టంగా కనిపిస్తుంది.  

  • వాహనాలపై వెళ్లేవారితో పాటు కాలినడకన వెళ్లే వారు కూడా వర్షంలో రోడ్డుపై వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఇక్కడ తెలుసుకోండి. 

పాదచారుల కోసం జాగ్రత్తలు

ఫ్లైఓవర్ల కింద ఆశ్రయం 

చాలా మంది వర్షం పడేటప్పుడు .. ఆశ్రయం కోసం ఫ్లైఓవర్ల కింద, చెట్ల కింద నిలబడుతుంటారు. కానీ ఇది చాలా ప్రమాదకరమని మీకు తెలుసా! కొన్ని సార్లు వేగంగా వచ్చే వాహనాలు నియంత్రణ కోల్పోయి ఢీకొట్టే ప్రమాదం ఉంటుంది. ఇక చెట్ల కింద నిలబడితే పిడుగుపాటుకు గురయ్యే అవకాశం ఉంది. 

రహదారి దాటేటప్పుడు జాగ్రత్త

వర్షంలో రోడ్డు దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సార్లు వైపర్లు పనిచేయకపోవడం లేదా తడిరోడ్డుపై బ్రేకులు పడకపోవడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఉంది. 

ప్రకాశవంతమైన దుస్తులు 

వర్షంలో నల్లటి, డార్క్ కలర్ బట్టలు వేసుకోకపోవడం మంచింది. రాత్రి సమయాల్లో ఇవి డ్రైవర్ కి కనిపించకపోవచ్చు.  కావున ప్రకాశవంతమైన రంగులు ఉన్న దుస్తులను ధరించాలి. 

Also Read: Actress Sadha: వెక్కి వెక్కి ఏడ్చిన హీరోయిన్ సదా.. కారణం తెలిస్తే కన్నీళ్లు ఆగవు!

Advertisment
తాజా కథనాలు