/rtv/media/media_files/2025/08/13/actress-sadha-crying-video-2025-08-13-16-53-03.jpg)
Actress Sadha crying video
Actress Sadha: వీధి కుక్కల సమస్యపై సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఢిల్లీ, NCR వంటి ప్రాంతాల్లో కుక్క కాటు కేసులు, ర్యాబిస్ వ్యాధితో చనిపోతున్న వారి సంఖ్య బాగా పెరుగుతుండడంతో సుప్రీం కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో జస్టిస్ జే.బి. పార్థివాలా, జస్టిస్ ఆర్. మహదేవన్ తో కూడిన ధర్మాసనం వీధి కుక్కల విషయంలో కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎనిమిది వారాల్లోపు ఢిల్లీ-NCRలోని అన్ని వీధి కుక్కలను తొలగించాలని ఆదేశించింది. వాటి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షెల్టర్లకు తరలించాలని సూచించింది.
వెక్కి వెక్కి ఏడ్చిన సదా..!
అయితే సుప్రీం కోర్టు తీసుకున్న ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఇది సరైనదని భావిస్తుండగా.. జంతు ప్రేమికులు మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ క్రమంలో సినీ నటి సదా వీధి కుక్కల విషయంలో సుప్రీం కోర్టు ఆదేశాలపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఎక్స్ లో వీడియోను పోస్ట్ చేశారు. ‘‘సుప్రీంకోర్టు తీర్పు నన్ను లోలోపలే చంపేస్తోంది. మన దేశాన్ని చూస్తుంటే సిగ్గుగా ఉంది. దయచేసి ఈ తీర్పు వెనక్కు తీసుకోండి’’ అంటూ వెక్కి వెక్కి ఏడ్చేసింది సదా! ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బోరుమని ఏడ్చేసిన సదా
— ChotaNews App (@ChotaNewsApp) August 13, 2025
ఢిల్లీ నుంచి వీధి కుక్కలన్నింటినీ తొలగించాలంటూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై కొన్ని వర్గాల నుంచి మాత్రం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సినీ నటి సదా కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘సుప్రీంకోర్టు ఈ తీర్పు నన్ను లోలోపలే చంపేస్తోంది. మన… pic.twitter.com/LvJNdRMtC4
దీనిపై జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ తీర్పు ఆచరణకు సాధ్యం కాదని అన్నారు. కేవలం ఢిల్లీలోనే సుమారు 3 లక్షల వీధి కుక్కలు ఉన్నాయని, వాటిని ఉంచడానికి అవసరమైన షెల్టర్లు, నిధులు లేవని ఆమె పేర్కొన్నారు.
ఇంకా ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న యానిమల్ బర్త్ కంట్రోల్ (ABC) రూల్స్, 2023 ప్రకారం, వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ (కుటుంబ నియంత్రణ), వ్యాక్సినేషన్ చేసి, వాటిని తిరిగి అదే ప్రాంతంలోనే వదిలేయాలని అన్నారు. కానీ సుప్రీంకోర్టు ఆదేశాలు ఈ నియమానికి విరుద్ధంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు.
చాలామంది జంతు హక్కుల కార్యకర్తలు, సినీ ప్రముఖులు (జాన్ అబ్రహం, అడివి శేష్ వంటివారు) ఈ తీర్పును "అమానవీయం" అని ఖండిస్తున్నారు. వీధి కుక్కలను సామూహికంగా బంధించడం అనేది సమస్యకు సరైన పరిష్కారం కాదని, శాశ్వత పరిష్కార మార్గాలు అన్వేషించాలని సూచిస్తున్నారు.
వీధి కుక్కలను పూర్తిగా తొలగిస్తే ఎలుకలు, ఇతర కీటకాల సంఖ్య పెరిగి కొత్త ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని మేనకా గాంధీ వంటివారు అభిప్రాయపడుతున్నారు. ఒక ప్రాంతం నుంచి కుక్కలను తొలగిస్తే, కొత్త ప్రాంతాల నుంచి వ్యాక్సిన్ వేయని కుక్కలు అక్కడికి వచ్చి చేరుతాయని, దీనివల్ల రేబిస్ వ్యాధి వ్యాప్తి మరింత పెరుగుతుందని జంతు సంరక్షణ సంస్థలు హెచ్చరిస్తున్నాయి.
Also Read:ఇది కదా కిక్ అంటే..! కూలీ 'మోనికా' సాంగ్ పై హాలీవుడ్ హాట్ బ్యూటీ కామెంట్స్ వైరల్..