![Ugadi Rasi Phalalu 2024:ఈ ఏడాది మీన రాశివారికి దిమ్మతిరిగే ఆదాయం..అంచెలంచెలుగా విజయం!](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-26-1-jpg.webp)
horoscope
Horoscope Today: మేష రాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల అవసరాలు, కోరికలకు ప్రాధాన్యం ఇవ్వాలి. కోపం అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడితే మంచిది. అనవసర వాదనల్లోకి దిగి అపవాదుల్ని మీదకు తెచ్చుకోకండి. మొండి పట్టుదలకు పోకుండా రాజీధోరణి అవలంబిస్తే మంచిది. వృథా ఖర్చులు తగ్గిస్తే మంచిది.
Also Read: Tirumalaకు వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్..10 రోజుల పాటు ఆ టికెట్లు రద్దు
వృషభ రాశి వారికి ఈ రోజు బాగుంది. అదృష్ట యోగం ఉంది. ఆర్థికంగా అభివృద్ధి, ధన లాభం ఉండవచ్చు. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి కావడం వల్ల ఆనందంగా ఉంటారు. సన్నిహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.
మిథునరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు కనపడుతున్నాయి. ఇంటా బయటా సమయానుకూలంగా నడుచుకోకపోతే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు, వివాదాలు పెరుగుతాయి. మానసిక ఒత్తిడితో ఆరోగ్య సంబంధమైన సమస్యలు ఏర్పడే అవకాశముంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి.
Also Read: Sabarimala వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. రూ.1033 కోట్లతో మాస్టర్ ప్లాన్
కర్కాటక రాశి వారికి ఈ రోజు బాగుంది. ముఖ్యంగా వ్యాపారులకు విశేషంగా ఉంది. ఆదాయంలో గణనీయమైన వృద్ధి ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు ఏర్పాటు చేసుకోడానికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.
సింహ రాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో విజయం సిద్ధిస్తుంది. ఆత్మవిశ్వాసం, దృఢ నిశ్చయం మీ జీవితంలో అద్భుతాలు చేస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ ఉండవచ్చు. ఆస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి. మనోబలంతో పనిచేసి మంచి గుర్తింపు పొందుతారు.
కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. దైవబలంతో ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడతారు. ఆర్ధిక పరిస్థితి మెరుగవుతుంది. ధ్యానం, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. స్నేహితులతో సరదాగా గడుపుతారు. విదేశీ మిత్రుల నుంచి శుభసమాచారం అందుకుంటారు.
తులా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ ప్రవర్తన కారణంగా బంధు మిత్రులతో విరోధం ఏర్పడుతుంది. కోపావేశాలపై అదుపు లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కోపం వల్ల ఏ సమస్యలూ తీరవు. మాట్లాడేది జాగ్రత్తగా మాట్లాడాలి. ఖర్చులు పెరగవచ్చు.
వృశ్చిక రాశి వారికి ఈ రోజు సరదాగా గడిచిపోతుంది. స్నేహితులతో విహారయాత్రలతో, విందు వినోదాలతో గడుపుతారు. సామాజిక సేవా కార్యక్రమాలతో మంచి గుర్తింపు సాధిస్తారు. కుటుంబ శ్రేయస్సు కోసం పనిచేయడం ఆనందాన్ని ఇస్తుంది. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.
ధనుస్సు రాశి వారికి ఈ రోజు అద్భుతం గా ఉంటుంది. ఆరోగ్యం, సంపద, సంతోషం, అదృష్టం ఇలా అన్నీ ఒకేరోజు ఉంటాయి. ఇంటి వాతావరణంలో సమన్వయ ధోరణి ఉండడంతో ప్రశాంతంగా ఉంటారు. ఉద్యోగంలో చురుగ్గా వ్యవహరిస్తారు. సహోద్యోగులు నుంచి అవసరమైన సహకారం ఉంటుంది. వ్యాపారంలో ఊహించని లాభాలు చూస్తారు.
తీరికలేని పనులతో..
మకర రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. గతం తాలూకు చెడు ప్రభావాలు ఇంకా తొలగిపోలేదు. వృత్తి వ్యాపారాలలో తీరికలేని పనులతో తలమునకలై ఉంటారు. కొందరి ప్రవర్తన బాధిస్తుంది. ఇది మీ నిర్ణయం తీసుకునే శక్తిని బలహీనపరుస్తుంది. వ్యాపారంలో నష్టాలు రాకుండా జాగ్రత్తపడాలి. ఖర్చులు పెరగకుండా చూసుకోండి.
కుంభ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. భావోద్వేగాలను అదుపు చేయడంలో విఫలమవుతారు. కుటుంబ కలహాలతో మానసిక ప్రశాంతత లోపిస్తుంది. చేసే పనిలో స్పష్టత లేనందువల్ల పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుంది. విద్యార్ధులు చదువులో రాణిస్తారు. ఆర్ధిక సమస్యలు ఏర్పడకుండా ఖర్చులు అదుపులో ఉంచుకోండి.
మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో సమిష్టి నిర్ణయాలు తీసుకోవడానికి మంచిరోజు. సానుకూల ఆలోచనలతో సంతోషంగా ఉంటారు. ఆత్మవిశ్వాసంతో లక్ష్యాలను సాధిస్తారు. ఉన్నతాధికారుల ప్రసంశలు అందుకుంటారు. ఉద్యోగంలో స్వస్థానప్రాప్తి ఉంటుంది. ఆదాయం ఆశించిన మేరకు ఉంటుంది.
Also Read: TG Accident: సూర్యాపేట హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్
Also Read: Arvind Panagariya: ప్రజలకు ఉచితాలు కావాలా? మెరుగైన సౌకర్యాలు కావాలా?: అరవింద్ పనగఢియా