/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-01T094512.156.jpg)
Horoscope
మేషరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఏ పని చేసిగా రెట్టింపు శుభ ఫలితాలు కనపడుతున్నాయి.
వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలున్నా పట్టుదలతో ముందుకు వెళ్తారు. భావోద్వేగాలను నియంత్రించుకుంటే మంచిది. కొన్ని సంఘటనలు విచారం కలిగిస్తాయి. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది.
Also Read: BIG BREAKING: తెలంగాణలో మందు బాబులకు షాక్.. భారీగా ధరల పెంపు!
మిథునరాశి వారికి ఈ రోజు బాగుంది. అన్ని రంగాల వారికి మంచి కార్యసిద్ధి ఉంది. ఇంటా బయట వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దల సలహాలు మేలు చేస్తాయి. వృత్తి వ్యాపారాలలో శుభవార్తలు వింటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
కర్కాటకరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. లక్ష్య సాధనపై దృష్టి పెడితే మంచి ఫలితాలుంటాయి. ప్రతి విషయాన్ని అనుమానించడం మంచిది కాదు. కాలాన్ని వృథా చేయకుండా కుటుంబ శ్రేయస్సు కోసం పనిచేస్తే విజయాలు సిద్ధిస్తాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బందులకు గురి చేసే అవకాశాలున్నాయి.
సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సౌభాగ్యసిద్ధి ఉంది. చేపట్టిన పనులు త్వరత్వరగా పూర్తవుతాయి. మీ మీ రంగాలలో శుభఫలితాలు కనపడుతున్నాయి. సమాజంలో కీర్తి సాధిస్తారు. శత్రుభయం పోతుంది. మీ పనితీరుకు ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు.
కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉంటాయి. నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. వ్యాపారంలో ఆర్థికవృద్ధి సాధిస్తారు. మీ పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని వ్యవహారాల్లో మొహమాటం వద్దు. అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.
Also Read: Trump: ట్రంప్ నిర్ణయంతో హెచ్‌ఐవీ మరణాలు 63 లక్షలు పెరుగుతాయంటున్న ఐరాస...!
నష్టాలు రాకుండా..
తులారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగులు తమ పై అధికారులతో వినయంగా ఉండకపోతే మంచిది కాదు. ఆర్థిక విషయాలలో అప్రమత్తంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో ఉత్సాహం కోల్పోకండి. మనోవిచారం కలిగించే సంఘటనలు జరుగుతాయి. వ్యాపారంలో నష్టాలు రాకుండా జాగ్రత్త పడాలి.
వృశ్చికరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూల పరిస్థితులు ఉంటాయి. చేపట్టిన పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోండి. వ్యాపారంలో ఆర్థిక ఇబ్బందులు చికాకు కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఖర్చులు కూడా పెరిగే అవకాశాలున్నాయి.
ధనుస్సురాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ధర్మసిద్ధి ఉంది. ఆస్తిని వృద్ధి చేస్తారు. సన్నిహితుల వలన మేలు కలుగుతుంది. ఇబ్బందికర సంఘటనలకు దూరంగా ఉంటే మంచిది. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్తారు. కోపం అదుపులో పెట్టుకోవాలి.
మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. స్వబుద్ధితో గొప్పవారవుతారు. చేపట్టిన పనుల్లో సమర్ధవంతంగా పనిచేస్తేనే విజయం లభిస్తుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. కీలక విషయాల్లో ఆచి తూచి అడుగేయాలి. సమాజంలో గుర్తింపు ఉంటుంది. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది.
కుంభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. బద్దకంతో పనులు వాయిదా వేయోద్దు. కీలక విషయాల్లో లౌక్యంగా వ్యవహరించాలి. భవిష్యత్తుకు ఉపయోగపడే పనులు చేపడితే మంచిది.
మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ రోజు విద్యార్థులకు శుభసూచకంగా ఉంది. వృత్తి ఉద్యోగాలలో కొత్త అవకాశాలు అందుకుంటారు. ముఖ్యమైన పనుల్లో సందర్భానుసారం ముందుకెళ్తే ప్రయోజనం కనపడుతుంది. తొందరపాటు నిర్ణయాలు నష్టం కలిగించే అవకాశాలున్నాయి జాగ్రత్త.
Also Read: UK: అమెరికా బాటలో యూకే.. 600 మందికి పైగా అక్రమ వలసదారులు అరెస్టు
Also Read: US Tech Layoffs: అమెరికాలో ఉన్న ఇండియన్స్‌కు మరో బిగ్ షాక్.. ఊడుతున్న వేలాది ఉద్యోగాలు!