Horoscope: ఈ రాశి వారు నేడు ఖర్చుల విషయంలో జాగ్రత్త..!

మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో పురోగతి లేకపోవడం నిరాశ కలిగిస్తుంది. ఒక వ్యవహారంలో డబ్బు నష్టపోవచ్చు.మిగిలిన రాశుల వారికి ఎలా ఉందంటే..

New Update
Horoscope

Horoscope

మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆశించిన ఫలితాల కోసం శ్రమించాలి. సన్నిహితులతో సత్సంబంధాలు నెలకొల్పడానికి ప్రయత్నిస్తారు. మిత్రులతో విహారయాత్రలకు వెళ్తారు. వృత్తి వ్యాపారాల్లో ఎదురయ్యే ఆటంకాలు ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు.

Also Read: Trump-China: ఆ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోండి..లేదంటే...చైనాకు ట్రంప్ హెచ్చరికలు!

వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. విశేషమైన గ్రహబలం ఉంటుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచన ఉంది. 

మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో పురోగతి లేకపోవడం నిరాశ కలిగిస్తుంది. ఒక వ్యవహారంలో డబ్బు నష్టపోవచ్చు. ప్రతికూల ఆలోచనలు, నిరాశావాదంతో రోజంతా గడుపుతారు. ఇంటి దగ్గర పరిస్థితులు కూడా పూర్తిగా నిరాశాజనకంగా ఉంటాయి.

Also Read: Madhya Pradesh:క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!

కర్కాటకరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. మనఃసౌఖ్యం ఉంటుంది. కుటుంబంతో సరదాగా గడుపుతారు. సాహసోపేతమైన నిర్ణయాలతో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే సత్ఫలితాలు ఉంటాయి.

సింహరాశి వారికి ఈ రోజు నిరాశాజనకంగా ఉంటుంది. గ్రహబలం అనుకూలంగా లేదు కాబట్టి ముఖ్యమైన పనులు, ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడం అవసరం. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి.

కన్యారాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. సత్సాంగత్యంతో కీలక విషయాల్లో పురోగతి సాధిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగంలో హోదా పెరిగే సూచన ఉంది. స్థానచలనం కూడా ఉండవచ్చు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

తులారాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. కీలక నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. గృహాలంకరణ కోసం ధనవ్యయం చేస్తారు. ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేసి అందరి ప్రశంసలు అందుకుంటారు. 

వృశ్చికరాశి వారికి ఈ రోజు అదృష్టకరంగా ఉంటుంది. దైవ దర్శనాలు, ఆర్ధిక ప్రయోజనాలు గొప్ప ఆనందం కలిగిస్తాయి. మంచి ఆరోగ్యం, ప్రశాంతమైన మనస్సు కలిసి అద్భుతాలు చేస్తాయి. చేపట్టిన పనులను సకాలంలో విజయవంతంగా పూర్తిచేస్తారు. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి

ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పొదుపు ప్రణాళికలు చేపడతారు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ప్రతికూల ఆలోచనలు వీడితే మంచిది. 


మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సమస్యల నుంచి బయటపడతారు. వృత్తి వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో విహారయాత్రలకు వెళ్తారు.


కుంభరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ రోజు ఆరోగ్యం, సంపద, సంతోషం అనుగ్రహం . విలాస వస్తువుల కోసం ధనవ్యయం చేస్తారు. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది.

మీనరాశి వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది. గ్రహ సంచారం సరిగా లేనందున ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. వివాదాలకు, అవమానకర సంఘటనలకు దూరంగా ఉంటే మంచిది. కొత్త పనులు, ప్రయాణాలు వాయిదా వేయండి. వృధా ఖర్చులు నివారించాలి.

Also Read: RTC Strike: తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె.. ఎప్పటినుంచంటే !

Also Read: Delhi: ఢిల్లీలో భానుడి భగభగ.. సీజన్‌లో ఆల్ టైం రికార్డు స్థాయి టెంపరేచర్

horoscope | horoscope-today | todays-horoscope | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates 

Advertisment
తాజా కథనాలు