Delhi: ఢిల్లీలో భానుడి భగభగ.. సీజన్‌లో ఆల్ టైం రికార్డు స్థాయి టెంపరేచర్

ఢిల్లీలో సోమవారం ఈ సీజన్‌లోనే ఇప్పటివరకూ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. సఫ్దర్‌జంగ్‌లో 40.2 డిగ్రీల సెల్సియస్‌ టెంపరేచర్ నమోదైంది. ఇది సాధారణం కంటే 5.1 డిగ్రీలు ఎక్కువని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రేపటి వరకూ ఢిల్లీలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

New Update
Delhi highest temperature

Delhi highest temperature

ఢిల్లీలో భానుడు తీవ్ర ప్రతాపం చూపుతున్నాడు. సోమవారం ఢిల్లీలో ఈ సీజన్‌లోనే ఇప్పటివరకూ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. సఫ్దర్‌జంగ్‌లో 40.2 డిగ్రీల సెల్సియస్‌ టెంపరేచర్ నమోదైంది. ఇది సాధారణం కంటే 5.1 డిగ్రీలు ఎక్కువని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంకా రానున్న రోజుల్లో ఉత్తర, మధ్య భారత్‌లో ఉష్ణోగ్రతలు భారీగా నమోదైయ్యే అవకాశం ఉందని  IMD అధికారులు అలర్ట్ జారీ చేశారు. ఢిల్లీలో మంగళవారం వరకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. దేశ రాజధానితోపాటు వాయువ్య, మధ్య భారతదేశంలో హీట్‌వేవ్ సంభవించవచ్చని తెలిపారు. 

Also read: Varanasi gang rape: ఇన్‌స్టాగ్రామ్ ఫ్రెండ్స్ యువతికి మత్తుమందు ఇచ్చి.. 23 మంది గ్యాంగ్‌రేప్

ఢిల్లీలోని పాలంలో ఉష్ణోగ్రత ఒకేసారి 39.5 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగింది. ఇది సాధారణం కంటే 4 డిగ్రీలు ఎక్కువ. సోమవారం నుండి బుధవారం వరకు రాజధానిలోని కొన్ని ప్రాంతాల్లో వేడిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. గరిష్ట ఉష్ణోగ్రతలు 40, 42 డిగ్రీల సెల్సియస్ చేరుకునే అవకాశం ఉంది. ఢిల్లీని ఇప్పటికే కాలుష్య భూతం పట్టి పీడిస్తుంటే.. మరో వైపు వేసవి ఉష్ణోగ్రతలు ఢిల్లీవాసులకు నరకం చూపిస్తున్నాయి. ఏప్రిల్ 7న హిమాచల్ ప్రదేశ్‌లోని ఏకాంత ప్రాంతాలు ప్రభావితమవుతాయి. ఏప్రిల్ 7 నుండి 10 వరకు హర్యానా, చండీగఢ్, పంజాబ్ ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉంది. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో ఏప్రిల్ 7 నుండి 9 వరకు, మధ్యప్రదేశ్‌లో ఏప్రిల్ 8 నుండి 10 వరకు వేడిగాలులు వీచే అవకాశం ఉంది. రాజస్థాన్, గుజరాత్, ఒడిశా, మహారాష్ట్రలలోని దాదాపు 21 నగరాల్లో రాబోయే రోజుల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

Also read: Mamata Banerjee: త్వరలోనే నన్ను అరెస్ట్ చేసి జైళ్లో వేస్తారు.. మమతా బెనర్జీ సంచలన కామెంట్స్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు