/rtv/media/media_files/2025/05/06/r2EcrCr2h2SnZKSHCXrI.jpg)
RAT
RAT TIPS: ప్రతి ఇంట్లో ఎలుకలు కనిపించడం చాలా మంది ఎదుర్కొనే సాధారణ సమస్య. అయితే అవి ఇంట్లో కలిగించే ఇబ్బందులు వర్ణనాతీతం. ఎలుకలు ఇంట్లో ఆహార పదార్థాలను తినడం, వస్తువులను కొరకడం, కరెంట్ వైర్లను తెంచటం వంటివి చేస్తాయి. ఇవి కేవలం ఆస్తి నష్టానికే కాకుండా.. ఆరోగ్య సమస్యలకు కూడా కారణమవుతాయి. అలాంటి సందర్భాల్లో సహజమైన, ప్రమాదం లేని కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా ఎలుకల బెడద నుండి బయటపడవచ్చు. ఆ చిట్కాల గురించి ఈ ఆర్టికల్‌లో కొన్ని విషాయాలు చూద్దాం.
దూరంగా పారిపోతాయి:
వెల్లుల్లి వాసనను ఎలుకలు అస్సలు ఇష్టపడవు. అందుకే వెల్లుల్లిని చిన్న ముక్కలుగా కోసి ఎలుకలు వచ్చే ప్రదేశాల్లో ఉంచడం వల్ల అవి ఆ ప్రదేశాల దగ్గరకు కూడా రావు. అదే విధంగా ఉల్లిపాయ కూడా బలమైన వాసన కలిగి ఉంటుంది. ఇది కూడా ఎలుకల్ని బాధపెడుతుంది. ఉల్లిపాయ ముక్కలను కోసి ఇంటి మూలల్లో ఉంచితే ఎలుకలు ఆ ప్రాంతాల దగ్గరికి రాకుండా ఉంటాయి. ఎలుకల బాధ పోవాలంటే లవంగం నూనెను ఉపయోగించవచ్చు. ఒక మృదువైన గుడ్డను తీసుకుని దానిని లవంగ నూనెలో ముంచి ఇంట్లో పలు ప్రదేశాల్లో ఉంచండి. ఎలుకలు ఆ వాసనను తట్టుకోలేక దూరంగా పారిపోతాయి.
ఇది కూడా చదవండి: గుండెపోటుకు అరటిపండుతో చెక్..రోజుకు 3 తినండి
పిప్పరమెంటు నూనె కూడా చాలా బలమైన వాసన కలిగి ఉంటుంది. కాటన్ బాల్స్‌ను తీసుకుని వాటిపై ఈ నూనెను వేసి, ఎలుకలు వచ్చే ప్రదేశాల్లో ఉంచితే అవి ఇక రావు. ఎర్ర మిరపకాయ పొడి మనుషులకే కాకుండా ఎలుకలకూ ఇబ్బందిగా ఉంటుంది. ఎలుకలు కనిపించే రంధ్రాల చుట్టూ ఈ పొడిని చల్లి ఉంచితే.. అవి బయటికి రావటమే కాదు, ఇంట్లోకి రాకుండా ఉంటాయి. ఈ విధంగా సహజమైన గంధ పదార్థాల వాసనను ఉపయోగించి ఎలుకలను హింసించకుండా ఇంటి నుండి తరిమికొట్టవచ్చు. ఇవి సరళమైనవి, రసాయనాలు లేని విధానాలు కావడం వల్ల ఆరోగ్యపరంగా కూడా సురక్షితంగా ఉంటాయి.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
ఇది కూడా చదవండి: మొలకెత్తిన వెల్లుల్లి తింటే ఏమవుతుంది?
( home-tips | home tips in telugu | latest-news | telugu-news)
Follow Us