/rtv/media/media_files/2025/10/31/pets-2025-10-31-14-59-30.jpg)
Pets
పెంపుడు జంతువులకు.. ముఖ్యంగా కుక్కలు లేదా పిల్లుల శరీరంలో పేలు (Fleas) ఉండటం అనేది చాలా సాధారణ సమస్య. ఈ చిన్న కీటకాలు జంతువుల చర్మానికి దురద, చికాకు కలిగించడమే కాక... కొన్నిసార్లు అలెర్జీలు (Allergies), ఇన్ఫెక్షన్లకు కూడా దారితీస్తాయి. ఈ సమస్య నుంచి బయటపడటానికి చాలామంది రసాయనాలు కలిగిన ఉత్పత్తులను వాడతారు. మీ పెంపుడు జంతువులకు ఈ పేల సమస్యతో బాధపడుతుంటే.. వెటర్నరీ డాక్టర్లు సులభమైన, ప్రభావవంతమైన ఇంటి చిట్కాల చెబుతున్నారు. ఇది పూర్తిగా సహజమైన చిట్కా.. కాబట్టి దీని వలన ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. ఈ చిట్కా, స్ప్రే తయారీ విధానం గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
పేల నివారణ స్ప్రే కోసం..
ఈ సహజమైన స్ప్రే తయారుచేయడానికి వంటగదిలో సులభంగా దొరికే కేవలం 3 పదార్థాలు అవసరం ఉంటుంది. వాటిల్లో నిమ్మకాయ (Lemon) 1,
థైమ్ (Thyme), యాపిల్ సైడర్ వెనిగర్ (Apple Cider Vinegar)ని సిద్దంగా పెట్టుకోవాలి. ముందుగా ఒక గిన్నెలో ఒక నిమ్మకాయను సన్నని ముక్కలుగా కోసి వేయాలి. అదే గిన్నెలో సుమారు రెండు టేబుల్ స్పూన్ల సన్నగా తరిగిన థైమ్ ఆకులను వేయాలి. ఇప్పుడు గిన్నెలో రెండు కప్పుల నీరు పోసి 60 నిమిషాల పాటు తక్కువ మంటపై బాగా మరిగించాలి. నిర్ణీత సమయం తర్వాత స్టవ్ ఆపివేసి నీరు పూర్తిగా చల్లబడే వరకు ఉంచాలి. చల్లారిన తర్వాత మిశ్రమాన్ని వడకట్టి అందులో రెండు టేబుల్ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ కలపాలి. ఇప్పుడు స్ప్రే సిద్ధంగా ఉంది. దీనిని ఒక స్ప్రే బాటిల్‌లో నింపుకోవాలి.
ఇది కూడా చదవండి: తడిగా లేదా పొడిగా.. జుట్టును ఏ కండిషన్‌లో దువ్వుకోవాలో తెలుసా..?
ఈ స్ప్రేను పెంపుడు జంతువుల బొచ్చు (Fur) పై వారానికి రెండు నుంచి మూడు సార్లు తేలికగా స్ప్రే చేయాలి. స్ప్రే వారి కళ్ళు, ముక్కు లేదా నోటిలోకి పోకుండా జాగ్రత్త వహించాలని వైద్యులుచెబుతున్నారు. స్ప్రే చేసిన తరువాత మిశ్రమం బాగా వ్యాపించేలా పేల దువ్వెన (Flea Comb) తో సున్నితంగా దువ్వండి. నిమ్మకాయలో ఉండే లిమోనెన్ (Limonene) అనే నూనె పేలను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. దాని పుల్లని రసం, తొక్క నూనె కీటకాలకు భరించలేని విధంగా ఉంటుంది. వంటల్లో ఉపయోగించే ఈ సుగంధ మూలిక పేలను తరిమికొట్టడంలో కూడా చాలా ప్రభావవంతంగా ఉంటుందని కొన్ని అధ్యయనాలు కనుగొన్నాయి. యాపిల్ సైడర్ వెనిగర్ పేలను నివారించడమే కాక.. పెంపుడు జంతువుల చర్మం యొక్క పీహెచ్ (pH) సమతుల్యతను కూడా కాపాడుతుంది. ఈ పెంపుడు జంతువుల సంరక్షణ కోసం ఈ సులభమైన, సహజ పద్ధతిని ప్రయత్నించవచ్చని వైద్యులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
ఇది కూడా చదవండి: ఆఫీసులో ఫోకస్ పెరగాలా..? అయితే మీ డెస్క్ మీద నుంచి ఈ మూడు వస్తువులు తీసేయండి
 Follow Us
 Follow Us