Home Tips: ఇల్లు సువాసనతో నిండాలంటే ఈ 5 వస్తువులు ఫ్లోర్ తుడిచే నీటిలో తప్పకుండా కలపండి

ఇంట్లో ఎక్కడో తెలియని చెమ్మ వాసన, తాజాగా లేని అనుభూతి కొంతమందిని ఇబ్బంది పెడుతుంది. ఈ సమస్యతో బాధపడుతున్న వారు రబ్బింగ్ ఆల్కహాల్, చెక్క ఫ్లోరింగ్, ఎసెన్షియల్ ఆయిల్స్, నిమ్మరసం, డిష్ సోప్, సోప్ వేసి ఇంటిని క్లీన్‌ చేస్తే రోజంతా తాజాగా ఉంటుంది.

New Update
water used to mop floor

Floor Cleaning

పండుగ సీజన్ వచ్చేసింది. ముఖ్యంగా దీపావళి పనులు ఇల్లు శుభ్రం చేయడంతో మొదలవుతాయి. ఈ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లను అద్భుతంగా అలంకరించుకోవాలనుకుంటారు. అయితే ఎంత శుభ్రం చేసినా.. ఇంట్లో ఎక్కడో తెలియని చెమ్మ వాసన (Musty smell) లేదా తాజాగా లేని అనుభూతి కొంతమందిని ఇబ్బంది పెడుతుంది. ఈ సమస్యతో బాధపడుతున్న వారికి ఈ చిట్కా చాలా ఉపయోగపడుతుంది. ఇల్లు రోజంతా తాజాగా, సువాసనతో ఉండేందుకు ఇల్లు తుడుచుకునే నీటిలో కలపాల్సిన అద్భుతమైన చిట్కాల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

ఇల్లు రోజంతా గుమగుమలాడుతుంది:

ఇంట్లో ఉండే దుర్వాసనను తొలగించడానికి.. నేలను శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొన్ని ప్రత్యేక పదార్థాలను కలపవచ్చు. ఇది ఇంటిని తళతళా మెరిపించడమే కాక రోజంతా తాజాగా ఉండేలా చేస్తుంది. రబ్బింగ్ ఆల్కహాల్ (Rubbing Alcohol) ఒక అద్భుతమైన కీటక నాశకారి (Disinfectant). ఇది నేలపై ఉండే క్రిములు, బ్యాక్టీరియా, ఫంగస్‌లను చంపుతుంది. ఇది మార్కెట్లో సులభంగా లభిస్తుంది. నేలను శుభ్రం చేసేటప్పుడు బకెట్ నీటిలో కప్పు రబ్బింగ్ ఆల్కహాల్ కలపాలి. ఇది గదిలో ఉండే దుర్వాసనను తొలగిస్తుంది. ముఖ్యంగా చెక్క ఫ్లోరింగ్ (hardwood), ల్యామినేట్, సీల్ చేసిన టైల్స్ వంటి నేలలకు ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇంట్లో సువాసన పెంచడానికి రబ్బింగ్ ఆల్కహాల్‌ బాగా  పని చేస్తుంది. కానీ రబ్బింగ్ ఆల్కహాల్ ఒక్కటే నేల శుభ్ర, వాసన తొలగించడానికి బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఉపయోగించి దీపావళి శుభ్రతను సులభతరం చేసుకోవచ్చు.
 
ఇది కూడా చదవండి: దీపావళి శుభ్రతలో.. ఎలుకలు మళ్లీ రాకుండా నిపుణుల సూచనలు

ఎసెన్షియల్ ఆయిల్స్ (Essential Oils) ఇల్లు రోజంతా సువాసనతో నిండి ఉండాలంటే.. తుడుచుకునే నీటిలో లావెండర్, నిమ్మ, పిప్పర్‌మెంట్ వంటి ఎసెన్షియల్ ఆయిల్స్ కొన్ని చుక్కలు కలపాలి. ఇది ఎలాంటి ఫ్లోర్‌కైనా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా  నిమ్మరసం (Lemon Juice) నేలను మెరిపించడమే కాక సహజమైన సువాసనను ఇస్తుంది. ఒక బకెట్ నీటిలో రెండు నిమ్మకాయల రసం కలిపి నేలను తుడవాలి. ఇది బ్యాక్టీరియాను చంపి.. ఇంటికి తాజా అనుభూతిని ఇస్తుంది. వెనిగర్ (Vinegar) అద్భుతమైన సహజ క్లీనర్. ఇది నేలపై ఉండే జిడ్డును, వాసనను తొలగిస్తుంది. బకెట్ నీటిలో అర కప్పు వెనిగర్ కలపాలి. వెనిగర్ వాసన నచ్చకపోతే.. కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ కలపవచ్చు. ఇది టైల్స్, వినైల్ ఫ్లోరింగ్‌కు బాగా పనిచేస్తుంది. ఇంకా డిష్ సోప్ (Dish Soap) తుడుచుకునే నీటిలో 5 నుంచి 10 చుక్కల డిష్ సోప్ కలపవచ్చు. ఇది జిడ్డును పూర్తిగా తొలగించి.. తేలికపాటి నురుగుతో నేలను మెరిసేలా చేస్తుంది. అయితే మరీ ఎక్కువ సోప్ కలపకుండా జాగ్రత్త వహించాలి. ఇది టైల్స్, స్టోన్, ల్యామినేట్, సీల్ చేసిన వుడ్‌కి ఉత్తమమైనది. ఈ సులభమైన పదార్థాలను ఉపయోగించి దీపావళి శుభ్రతను పూర్తి చేసి ఇంటిని రోజంతా సువాసనతో ఉంచుకోవచ్చు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.  

ఇది కూడా చదవండి: పెంపుడు జంతువులకు స్నానం చేయించే సులభమైన చిట్కాలు మీకోసం

Advertisment
తాజా కథనాలు