Holi 2025: ఈ ఏడాది హోలీ పండుగ ఎప్పుడు జరుపుకోవాలంటే?

ఈ ఏడాది హోలీ పండుగను మార్చి 14వ తేదీన జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. మార్చి 14వ తేదీన మధ్యాహ్నం 12 గంటల వరకు పౌర్ణమి తిథి ఉంటుంది. ఈ సమయంలోనే హోలీ పండుగను జరుపుకోావాలి. హోలికా దహనాన్ని మార్చి 13వ తేదీ రాత్రి 11.26 నుంచి అర్దరాత్రి 12.30 వరకు చేయాలి.

author-image
By Kusuma
New Update
Holi

Holi Photograph: (Holi)

దేశవ్యాప్తంగా హోలీ పండుగను అందరూ జరుపుకుంటారు. వయస్సుతో సంబంధం లేకుండా అందరూ కూడా ఈ పండుగకి ఎంజాయ్ చేస్తారు. అయితే ఈ ఏడాది హోలీ పండుగను మార్చి 13 లేదా మార్చి 14వ తేదీన జరుపుకోవాలని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఈ రెండు రోజుల్లో తిథి రావడంతో చాలా మందిలో హోలీ ఎప్పుడనే సందేహం వచ్చింది. అయితే ఈ ఏడాది హోలీ పండుగను మార్చి 14వ తేదీన జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు.

ఇది కూడా చూడండి:Lalith Modi: లలిత్ మోదీకి వనువాటు పౌరసత్వం..ఎంతకు కొన్నారో తెలుసా?

ఈ తేదీల్లో మాత్రమే..

ఫాల్గుణ మాసం పౌర్ణమి నాడు హోలీ పండుగను జరుపుకోవాలి. అంటే మార్చి 13వ తేదీ ఉదయం 10:25 గంటలకు పౌర్ణమి తిథి ప్రారంభం అవుతుంది. మార్చి 14వ తేదీ మధ్యాహ్నం 12:03 గంటలకు పౌర్ణమి తిథి పూర్తి అవుతుంది. ఈ సమయంలో హోలీ పండుగను జరుపుకోవాలి. అయితే హోలీ పండుగ జరుపుకోవడానికి ముందు హోలికా దహనం చేయాలి. 

ఇది కూడా చూడండి:Horoscope Today: ఈ రోజు ఈ రాశి వారికి సొంత నిర్ణయాలు నష్టాన్ని తెచ్చిపెడతాయి.. జాగ్రత్త!

దీన్ని మార్చి 13 వ తేదీ రాత్రి 11.26 నుంచి అర్దరాత్రి 12.30 లోగా హోలికా దహనం జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. అయితే హోలికా దహనాన్ని భద్ర కాల సమయంలో అసలు చేయకూడదు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి కలుగుతుంది. కుటుంబంలో సంతోషం, సుఖం ఉండదని పండితులు అంటున్నారు. 

ఇది కూడా చూడండి: TG News: మహిళలపై సీఎం రేవంత్ వరాల జల్లు.. ఇందిరా మహిళాశక్తి మిషన్-2025 పాలసీ ప్రకటన!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది.RTVదీనిని ధృవీకరించడం లేదు. పూర్తి వివరాలకు నిపుణులను సంప్రదించడం మేలు.

Advertisment
తాజా కథనాలు