Heart Health: ఇలా చేస్తే గుండెపోటు అస్సలు రాదు!

ఈ మధ్య గుండెపోటు కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. అయితే అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి, నిద్రలేమి, మద్యపానం వంటి అనేక విషయాలు దీనికి కారణం. ప్రతి రోజు శారీరక శ్రమ, హెల్తీ డైట్ తీసుకోవడం ద్వారా ఈ ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

New Update
  Heart Attack

Heart Attack

Heart Attack :ఇటీవలి కాలంలో చిన్నవయసులోనే గుండెపోటుకు గురైన సంఘటనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. జీవనశైలి విధానాలు, ఆహారపు అలవాట్లు దీనికి ముఖ్య కారణాలుగా ఉంటున్నాయి. చాలా మంది రోజంతా వర్క్ బిజీలో పడిపోయి శారీరక శ్రమ, ఆహరం పై అశ్రద్ధ చేస్తుంటారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఒత్తిడి, నిద్రలేమి, మద్యపానం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం  వంటి అనేక కారణాలు గుండె పోటుకు దారి తీసే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అయితే కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను రోజు దినచర్యలో పాటిస్తే, గుండెపోటు ప్రమాదాన్ని నివారించవచ్చు. అవేంటో తెలుసుకుందాం.. 

Also Read : ఇలా చేస్తే గుండెపోటు అస్సలు రాదు!

ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు 

యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నివేదికల ప్రకారం గుండెపోటు ప్రమాదాన్ని నివారించడానికి చేయాల్సిన అతి ముఖ్యమైన పని అనారోగ్యపు ఆహార అలవాట్లకు దూరంగా ఉండడం. ఉప్పు, పంచదార, నెయ్యి, వెన్న, చీజ్ లేదా కొవ్వు కలిగిన ఆహారాలను వీలైనంత తక్కువగా తీసుకోవాలి.  అలాగే ప్రాసెస్ చేసిన ఆహారాలు, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వంటివి మానుకోవాలి. తృణధాన్యాలు, పచ్చి ఆకు కూరలు, తాజా పండ్లు, గింజలు, గుడ్లు, చేపలు, బాదం పప్పులు  మొదలైనవి డైట్ లో చేర్చుకోవాలి. 

స్ట్రెస్ 

ఒత్తిడి మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యాన్ని కూడా పాడుచేస్తుంది. పరిశోధన ప్రకారం, ఒత్తిడి కారణంగా శరీరంలోని 400 బయోకెమికల్స్ మార్పులకు కారణమవుతుంది. ఇలా జరిగినప్పుడు ఆకస్మాత్తుగా రక్తపోటు, పల్స్ రేట్ పెరుగుతుంది. ఇది గుండెపోటుకు దారితీస్తుంది. ఒత్తిడిని తగ్గించడానికి మెడిటేషన్, యోగా వంటివి చేయాలి. 

సిగరెట్,  ఆల్కహాల్‌

సిగరెట్,  ఆల్కహాల్‌ ఆరోగ్యానికి హానికరమని తెలిసినప్పటికీ చాలా మంది వీటికి బానిసలవుతుంటారు. వీటిని సేవించడం వల్ల ఊపిరితిత్తులు,  నోటి క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అంతే కాదు ఈ అలవాట్లు గుండె ఆరోగ్యాన్ని కూడా పడు చేస్తాయి. 

Smoking

Also Read :  హిందూ దేవాలయాలపై దాడి... 'హైదరాబాద్‌లో ఉగ్రవాదులు'

శారీరక శ్రమ 

ప్రతిరోజూ వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ లేదా జిమ్‌కి వెళ్లడం చేయాలి. రోజుకు 10 నుంచి 20 నిమిషాల శారీరక శ్రమ తప్పనిసరిగా ఉండాలి. శారీరక శ్రమ లేకుండా ఒకేచోట కూర్చోవడం వల్ల శరీరంలో కొవ్వు, కేలరీల నిల్వలు పెరిగిపోతాయి. ఇవి క్రమంగా గుండె పై ప్రభావాన్ని చూపుతాయి. 

Also Read :  మేము చనిపోతాం.. అనుమతివ్వండి

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read:  హనీ ట్రాప్‌ వెనుక వైసీపీ నేతలు..? వెలుగులోకి సంచలన విషయాలు

Advertisment
తాజా కథనాలు