AP News: హనీ ట్రాప్‌ వెనుక వైసీపీ నేతలు..? వెలుగులోకి సంచలన విషయాలు

హనీ ట్రాప్‌ వెనుక వైసీపీ నేతలు ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. అటవీ శాఖ అధికారి వేణురెడ్డి ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ అవ్వడం మరిన్ని అనుమానాలకు కారణమైంది. వేణురెడ్డికి వైసీపీ నేతలతో సంబంధాలు ఉండడం ఆసక్తిని రేపుతోంది.

New Update
 Vizag Honeytrap

Vizag Honeytrap

Vizag Honeytrap: విశాఖ హనీ ట్రాప్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో అటవీ శాఖ అధికారి వేణురెడ్డికి సంబంధం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి వేణురెడ్డిని ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్‌లో రెండు రోజుల పాటు పోలీసులు విచారించారు. అయితే విచారణ అనంతరం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన అటవీశాఖ అధికారి.. ఆ తరువాత పత్తాలేకుండా పోయారు. జాయ్ జమీమా ఫోన్‌లో అటవీ శాఖ అధికారికి సంబంధించిన సమాచారం లభ్యమైనట్లు తెలుస్తోంది. జమీమా, అటవీ శాఖ అధికారి వేణురెడ్డికి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో వేణురెడ్డి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు వేణురెడ్డికి పలువురు వైఎస్సార్‌ పార్టీ నేతలతో సంబంధాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కీలకంగా మారిన అటవీ అధికారి:

గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వ పెద్దలతో వేణురెడ్డికి సంబంధాలు ఉండడంతో తెర వెనుక ఉండి జాయ్‌ జమీమాతో హానీట్రాఫ్‌ చేయించాడనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఇదిలా ఉండగా.. విశాఖ హనీట్రాప్ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో సూత్రధారిగా ఉన్న జాయ్ జమీమాతో పాటు ఆ గ్యాంగ్ ఎంతోమందిని ట్రాప్ చేసినట్లు తేలింది. హనీ ట్రాప్‌ వ్యవహారంలో బాధితుల జాబితా ఎక్కువగానే కనిపిస్తోంది. జాయ్ జమీమా పెళ్లికాని యువకులతో పాటు వివాహితులను కూడా తన వలలో వేసుకుందని పోలీసుల విచారణలో బయటపడింది. ఎన్‌ఆర్‌ఐ ఫిర్యాదుతో అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన జమీమాని భీమిలి పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించారు. ఆమె ఎటువంటి సమాచారం చెప్పకపోగా తానే బాధితురాలినని, తననే అంతా మోసం చేశారని చెప్పింది.

బయటకొస్తున్న బాధితులు..

మరోవైపు హనీ ట్రాప్ కేసులో కీలక సూత్రధారి జాయ్ జమీమా దారుణాలు సోషల్ మీడియాలో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. జాయ్ జమీమా గ్యాంగ్ ఇచ్చిన మత్తు మందు కారణంగా బాధితులు ఇన్ఫెక్షన్‌కు గురయ్యారు. శరీరంపై పొక్కులు రావడంతో కనీసం పడుకోలేని పరిస్థితి ఏర్పడింది. శరీరమంతా రక్తంతో ఇబ్బంది పడిన ఫోటోలను ఓ బాధితుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. జాయ్ జమీమా గ్యాంగ్ చేతిలో నరకం అనుభవించానని పోలీసులకు వెల్లడించాడు. ‘‘జాయ్ జమీమా పగలు మేకప్ వేసుకుని.. రాత్రులు బ్రేకప్ చెబుతుంది. జాయ్ జమీమా తెర వెనుక బ్లాక్‌మెయిల్ డ్రామాలు నడుపుతుంది. అర్ధరాత్రి బాధితుల ఇంటికి పోలీసులతో వెళ్లి అరెస్టు చేయాలంటూ హల్‌చల్ చేస్తుంది. వెంటనే అరెస్ట్ చేయాలంటూ పోలీసులను సైతం జాయ్ జమీమా బెదిరిస్తుంది. తన తల్లి గెజిటెడ్ ఆఫీసర్ అంటూ మాయ మాటలు చెబుతుంది. నగర సీపీ, కలెక్టర్‌కు తన తల్లి మంచి ఫ్రెండ్’’ అంటూ పోలీసులను బెదిరించిన వీడియోలను బాధిత బంధువులు పోస్ట్ చేశారు.

వెలుగులోకొస్తున్న సంచలన విషయాలు..

కాగా విశాఖ హనీ ట్రాప్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితురాలు జాయ్ జెమీమా పోలీసులకు ఝలక్ ఇచ్చినట్లు గుర్తించారు. 10 నెలల కిందటే ఓ వ్యాపారవేత్తను హనీ ట్రాప్ చేసి కేసు పెట్టించింది. ఆ సమయంలో జాయ్ జమీమా మోసాలను పోలీసులు గుర్తించలేకపోయారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో అనేక మంది అమాయకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లుగా గుర్తించారు. వరుసగా ఫిర్యాదులు రావడంతో ఆమె మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. జాయ్ జమీమా టార్గెట్ ధనవంతులు, అధికారులు, ఎన్నారైలు. అందమైన ఫోటోలను ఆయా వ్యక్తులకు పంపి వారిని ట్రాప్ చేయడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. ఆ తర్వాత రూమ్‌కు పిలిపించుకుని వారికి మత్తు మందు ఇచ్చి నగ్నంగా ఫోటోలు చిత్రీకరించి వారి నుంచి డబ్బులు వసూలు చేస్తుంది. ఆమె బాధితులు దాదాపు 15 మంది ఉన్నట్లు సమాచారం. వారిలో వ్యాపారవేత్తలు, ఎన్నారై, పోలీసులు, నేవీ అధికారులున్నట్లు తెలియవచ్చింది. ఇప్పటి వరకు బాధితుల్లో కొంతమంది మాత్రమే బయటకు వచ్చారు. త‌మ‌ కేసు వివరాలు బయటకు వస్తాయనే భ‌యంతో నేరుగా సీపీకి ఫిర్యాదు చేశారు. ఇక్కడ ట్విస్టు ఏంటంటే తనను రేప్ చేశాడంటూ 10 నెలల కిందట బాధితుడిపై మద్దిలపాలెం పోలీసుస్టేషన్‌లో జాయ్ జమీమా రివర్స్ కేసు పెట్టింది. ఇప్పుడు ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

 

 

 

ఇది కూడా చదవండి: కరివేపాకు నీటితో ఎంతటి పొట్ట అయినా కరగాల్సిందేనా?

 

ఇది కూడా చదవండి: భారత్‌లోని ఈ రైల్వేస్టేషన్ల నుంచి విదేశాలకు వెళ్లొచ్చు

 

 

ఇది కూడా చదవండి: పిల్లలకి ఏ వయసులో ఏ టీకా వేయించాలి?

 

 

ఇది కూడా చదవండి: ఇక్కడ 117 రోజులకు  ఒకసారి సూర్యోదయం

Advertisment
Advertisment
తాజా కథనాలు