/rtv/media/media_files/2025/08/04/pregnancy-2025-08-04-08-29-20.jpg)
Pregnancy
Pregnancy: వివాహం తర్వాత చాలామంది జంటలు తల్లిదండ్రులు కావాలని ప్రయత్నిస్తారు. కానీ ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం తక్కువగా ఉంటుంది. దీనికి అతి ముఖ్యమైన కారణం సరైన సమయం తెలియకపోవడం. ప్రతి నెలా కొన్ని రోజులు మాత్రమే గర్భం ధరించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయాన్ని ఓవ్యులేషన్ పీరియడ్ అంటారు. ఈ రోజుల్లో శారీరక సంబంధం పెట్టుకుంటే.. గర్భం దాల్చే అవకాశాలు అధికంగా పెరుగుతాయి. గర్భం ధరించడానికి ఓవ్యులేషన్ పీరియడ్ (Ovulation period) ఉత్తమ సమయంగా నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో మహిళ శరీరంలో అండాలు తయారవుతాయి.. అవి 12 నుంచి 24 గంటల వరకు జీవించి ఉంటాయి. అయితే.. ప్రతి మహిళకు ఓవ్యులేషన్ ఒకేలా ఉండదు. ఇది వారి పీరియడ్ సైకిల్ మీద ఆధారపడి ఉంటుంది. ఓవ్యులేషన్ పీరియడ్ సమయం గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
గర్భధారణ అవకాశాలు ఎక్కువ..
మహిళల రుతు చక్రం 28 రోజులు అయితే.. సాధారణంగా పీరియడ్ మొదలైన 14వ రోజున ఓవ్యులేషన్ జరుగుతుంది. ఈ సందర్భంలో 10వ రోజు నుంచి 17వ రోజు వరకు ఫర్టైల్ విండోగా చెబుతారు. ఈ సమయంలోనే గర్భధారణ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్పెర్మ్ మహిళ శరీరంలో దాదాపు 5 రోజుల వరకు సజీవంగా ఉండగలదు. కాబట్టి ఓవ్యులేషన్ కు 2-3 రోజుల ముందు కూడా శారీరక సంబంధం పెట్టుకుంటే గర్భం ధరించవచ్చు. అయితే ప్రతి ఒక్కరి రుతు చక్రం 28 రోజులు ఉండదు. 21 రోజుల రుతు చక్రం ఉన్నవారికి.. ఓవ్యులేషన్ సుమారు 7వ రోజున జరుగుతుంది. 35 రోజుల రుతు చక్రం ఉన్నవారికి.. ఇది 21వ రోజున జరుగుతుంది. అయితే 14 రోజుల ఫార్ములా ప్రతి మహిళకు సరైనది కాదని నిపుణులు చెబుతున్నారు.
ఓవ్యులేషన్ గుర్తించే పద్ధతులు:
ఓవ్యులేషన్ కిట్: ఈ కిట్ మూత్రంలో లూటినైజింగ్ హార్మోన్ (LH) ను కొలుస్తుంది. ఈ హార్మోన్ ఓవ్యులేషన్‌కు ముందు వేగంగా పెరుగుతుంది.
శరీర సంకేతాలు: ఈ సమయంలో శరీర ఉష్ణోగ్రత కొద్దిగా పెరుగుతుంది. కొంతమంది మహిళల రొమ్ములలో మార్పులు సంభవిస్తాయి.
ఇది కూడా చదవండి: ఈ అలవాట్ల ఉంటే యవ్వనంలోనే చర్మంపై ముడతలు.. వయస్సు కాక మరో కారణాలు ఇవే
గైనకాలజిస్ట్ నిపుణులు అభిప్రాయం ప్రకారం.. రుతుచక్రం 28 రోజులు ఉంటుంది. పీరియడ్ మొదటి రోజు మొదటి రోజుగా చెబుతారు. సాధారణంగా 14వ రోజు ఓవ్యులేషన్ జరుగుతుంది.11వ నుంచి 17వ రోజు వరకు అత్యంత ఫర్టైల్ సమయంగా చెబుతున్నారు. ఈ సమయంలో శారీరక సంబంధం పెట్టుకుంటే గర్భధారణ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో జంటలు 1-2 నెలలు నిరంతరం ప్రయత్నిస్తే.. గర్భం ధరించే అవకాశం చాలా పెరుగుతుందని అంటున్నారు. పీరియడ్స్ రెగ్యులర్‌గా (Periods regular) లేని మహిళలు ఓవ్యులేషన్ కిట్లను ఉపయోగించవచ్చు లేదా ఫోలిక్యులర్ స్కాన్ చేయించుకోవచ్చు. ఈ పరీక్ష డాక్టర్ సహాయంతో చేయించుకోవటం మంచిది. ఇది సరైన ఓవ్యులేషన్ (Ovulation) రోజును తెలుసుకోవడానికి సహాయపడుతుంది. అవసరమైతే.. ఎక్కువ సలహాలు తీసుకోవాలంటే గైనకాలజిస్ట్‌ను సంప్రదించటం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: బీపీ ఉన్నవారు టీ తాగొచ్చా.. నిపుణులు చెప్పే మాటలు ఇవే..!