BP: బీపీ ఉన్నవారు టీ తాగొచ్చా.. నిపుణులు చెప్పే మాటలు ఇవే..!

టీ రక్తపోటును గణనీయంగా ప్రభావితం చేస్తుంది. టీలో ఉండే కెఫీన్ ఒక ఉద్దీపనకారి.. ఇది తాత్కాలికంగా రక్తపోటును పెంచుతుంది. కొందరి శరీరం కెఫీన్‌కు చాలా సున్నితంగా ఉంటుంది. అలాంటి వారిలో టీ తాగిన వెంటనే రక్తపోటు స్వల్పంగా పెరుగుతుందని చెబుతున్నారు.

New Update
BP Vs Tea

BP Vs Tea

BP Vs Tea: భారతదేశంలో టీ కేవలం ఒక పానీయం కాదు.. అది ఒక అలవాటు, ఒక భావోద్వేగం. రోజు మొదలుకొని చివరి వరకు ప్రతి మలుపులోనూ మనతో ఉండేది టీ. అయితే.. అధిక రక్తపోటు (BP) ఉన్నవారు ఈ అలవాటును కొనసాగించవచ్చా? గుండె జబ్బులు, హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్నవారి అనే డౌట్‌ చాలామందిలో ఉంటుంది.  ఒక్క కప్పు టీతో ఏమవుతుందని కొన్నిసార్లు అనుకుంటాం. కానీ వైద్యుల దృష్టిలో ఇది అంత తేలికైన విషయం కాదు. డాక్టర్ల అభిప్రాయం ప్రకారం.. టీ మన శరీరంపై చూపే ప్రభావం రక్తపోటును గణనీయంగా ప్రభావితం చేస్తుంది. టీలో ఉండే కెఫీన్ ఒక ఉద్దీపనకారి.. ఇది తాత్కాలికంగా రక్తపోటును పెంచుతుంది. కొందరి శరీరం కెఫీన్‌కు చాలా సున్నితంగా ఉంటుందని వైద్యులు అంటున్నారు.  అలాంటి వారిలో టీ తాగిన వెంటనే రక్తపోటు స్వల్పంగా పెరుగుతుందని చెబుతున్నారు. అయితే రక్తపోటు ఉన్నవారు టీని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు. దాని గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

బీపీ ఉంటే టీకి దూరం ఉంటే మంచిది.

బీపీ ఉంటే  టీ పరిమాణం, రకంపై శ్రద్ధ వహించాలి. రోజుకు 1 కప్పు టీ తాగడం సురక్షితమని చెబుతారు.  అంతేకాని ఎక్కువ సార్లు టీ తాగితే అనేక సమస్యలు వస్తాయి. ఈ టీ కంటే బ్లాక్ టీ లేదా గ్రీన్ టీలో కెఫీన్ తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండెకు మేలు చేస్తాయి. తులసి, అల్లం, దాల్చినచెక్క టీ వంటి హెర్బల్ టీలు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. ఎందుకంటే అవి రక్తపోటును సహజంగా నియంత్రించడంలో సహాయపడతాయి.

ముఖ్యంగా విషయాలు:

  • చాలా మంది ఉదయం లేవగానే టీ తాగుతారు. ఇది ఎసిడిటీ, గుండెల్లో మంటను కలిగిస్తుంది. అందుకని ఏమైనా ఆహారం తిన్న తర్వాత కొద్దిగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.
  • కొందరూ టీతో పాటు ఉప్పగా, వేయించిన స్నాక్స్‌ తింటారు. ఇలా తినే పదార్ధాలు సోడియం స్థాయిలను పెంచుతాయి. ఇవి రక్తపోటును మరింత పెంచుతుందని చెబుతున్నారు.
  • నేటికాలంలో చాలా మంది నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి రాత్రి సమయంలో పాలు తాగమని చెబుతారు.  కానీ మరి కొందరూ రాత్రి పడుకునే ముందు టీ తాగారు. ఇది నిద్రపై ఎక్కువ ప్రభావితం చేస్తుంది. నిద్రలేమి కూడా బీపీని పెంచుతుంది.

రక్తపోటు నియంత్రణలో లేకపోతే.. టీ తాగడం పూర్తిగా మానేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. బీపీ రోగులు టీ తాగేటప్పుడు జాగ్రత్త వహించడం అవసరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మోతాదు, రకం, తీసుకునే సమయం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుంటే.. ఈ అలవాటు ఆరోగ్యానికి హానికరంగా మారకుండా చూసుకోవచ్చు. ఈ సమస్య ఇంకా ఏమైనా సందేహాలుంటే మంచి వైద్య నిపుణులను సంప్రదించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: నోటి క్యాన్సర్ ముందస్తు గుర్తింపుతో ప్రాణాలు కాపాడుకోవచ్చు

( Latest News | telugu-news )

ఇది కూడా చదవండి:
పీచు టీతో కిడ్నీలోని రాళ్లకు చెక్.. అద్భుత ప్రయోజనాలు ఇవే..!!


Advertisment
తాజా కథనాలు