Health Tips: ఆరోగ్యాన్ని మెరుగుపరచే సూపర్ ఫుడ్స్.. ఈ సమయంలోనే తీసుకోవాలి.. లేకపోతే వెరీ డేంజర్

ఎలాంటి నీరసం, అలసట లేకుండా రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే గుమ్మడికాయ గింజలు, బాదం, సోయాబిన్, పుట్టగొడుగులు వంటివి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పోషకాలు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా చేస్తాయని నిపుణులు అంటున్నారు.

New Update
Healthy person

Healthy

కొందరు నీరసం, అలసటగా ఉంటారు. ఏదైనా చిన్న పని చేస్తే చాలు బలం అంతా కోల్పోతారు. అయితే రోజంతా యాక్టివ్‌గా ఉంటూ ఏదైనా పని చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా కొన్ని బలమైన ఫుడ్స్ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వీటిని తీసుకోవాల్సిన సమయంలో మాత్రమే తీసుకోవాలి. అప్పుడే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.  అయితే ఏయే పదార్థాలు తీసుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుందో ఈ స్టోరీలో చూద్దాం.

ఇది కూడా చూడండి: Loneliness: ఒంటరితనంతో జాగ్రత్త! రోజుకు 15 సిగరెట్లు తాగినంత ప్రమాదం.. షాకింగ్ రిపోర్ట్!

గుమ్మడికాయ గింజలు

ప్రోటీన్ అధికంగా ఉండే గుమ్మడికాయ గింజలు శరీరానికి శక్తిని తక్షణమే అందిస్తాయి. ఇవి మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తాయి. అలాగే ఎలాంటి అనారోగ్య సమస్యలను అయినా కూడా క్లియర్ చేస్తాయని నిపుణులు అంటున్నారు. అలాగే ఇవి నీరసం, అలసట వంటి  సమస్యలు కూడా తగ్గుతాయి నిపుణులు చెబుతున్నారు. 

పుట్టగొడుగులు

పుట్టగొడుగుల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులోని ప్రోటీన్, ఫైబర్ వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. బాగా నీరసంగా ఉన్నవారు తప్పకుండా పుట్టగొడుగులను డైలీ తినడం వల్ల  తక్షణమే శక్తి అందడంతో పాటు ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని నిపుణులు అంటున్నారు. 

సోయాబిన్

వీటిలో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.  ఇవి శరీరానికి సమృద్ధిగా శక్తిని అందిస్తాయి. వీటిని డైలీ తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఇందులోని ప్రొటీన్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటివల్ల కండరాలు బలంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. 

బాదం

వీటిలో విటమిన్ ఈ, ఎ పుష్కలంగా ఉంటాయి. వీటిని రాత్రిపూట నానబెట్టి ఉదయం తింటే మెదడు పనితీరు మెరుగుపడుతుందని నిపుణులు అంటున్నారు. ఇందులోని ప్రొటీన్లు అనారోగ్య సమస్యలను తగ్గించడంతో పాటు చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కూడా పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. డైలీ వీటిని తప్పకుండా తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని అంటున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. 

ఇది కూడా చూడండి: Jammi Chettu: దసరా నాడు అదృష్టాన్ని తెచ్చే జమ్మి శ్లోకం.. పూజ సమయంలో ఇది రాయడం అస్సలు మర్చిపోవద్దు!

Advertisment
తాజా కథనాలు